Household Tips | మీ కుక్కర్ విజిల్ రావట్లేదా.. ఈ ట్రిక్స్ తెలిస్తే మీరే చిటికెలో బాగుచేసుకోవచ్చు!
Household Tips | మీ ప్రెజర్ కుక్కర్ విజిల్ రావడం లేదా? నిజానికి చాలా చిన్న కారణాల వల్లే ఈ సమస్య వస్తుంది. కానీ కొన్ని చిట్కాలు తెలిస్తే ఈ సమస్యను చిటికెలోనే సరిచేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Household Tips | మన ఇళ్లలో వంటల్లో ప్రెజర్ కుక్కర్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. అన్నం వండుకోవాలన్నా.. పప్పు ఉడికించాలన్నా.. నాన్‌వెజ్ చేయాలన్నా దీన్ని తప్పనిసరిగా వాడుతుంటాం.. తరచూ వాడటం వల్ల అప్పుడప్పుడు విజిల్ రాదు. దీంతో వంట ఆలస్యమైపోతుంటుంది. నిజానికి చాలా చిన్న కారణాల వల్లే ఈ సమస్య వస్తుంది. కానీ కొన్ని చిట్కాలు తెలిస్తే ఈ సమస్యను చిటికెలోనే సరిచేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.గ్యాస్కెట్(రబ్బర్ రింగ్) దెబ్బతినడం
కుక్కర్ విజిల్ రాకపోవడానికి ప్రధాన సమస్య.. దాని మూతకు పెట్టే రబ్బర్ రింగ్(గ్యాస్కెట్) అనే చెప్పొచ్చు. ఈ గ్యాస్కెట్ పాతబడినా, వదులుగా మారినా ఆవిరి పక్కల నుంచి బయటకు లీకవుతుంది. దీంతో కుక్కర్ లోపల ప్రెజర్ ఏర్పడక విజిల్ రాదు. గ్యాస్కెట్ వదులుగా ఉన్నట్లు అనిపిస్తే కాసేపు దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి వాడుకోవాలి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కొత్త గ్యాస్కెట్ మార్చుకోవడం బెటర్.
2. విజిల్ బ్లాక్ అవ్వడం
రెగ్యులర్‌గా కుక్కర్‌ను వాడిన తర్వాత సరిగ్గా శుభ్రం చేయకపోతే విజిల్‌లోని చిన్న రంధ్రంలో పప్పు, అన్నం మెతుకులు చిక్కుకుపోతుంటాయి. దీనివల్ల ఆవిరి బయటకు రాదు. అప్పుడు విజిల్‌పైకి లేచే పరిస్థితి ఉండదు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు చిన్న పిన్‌తో అడ్డుగా ఉన్న వాటిని క్లీన్ చేసుకోవాలి.
3. సేఫ్టీ వాల్స్ లోపం
కుక్కర్ మూతకు ఉండే సేఫ్టీ వాల్వ్ సరిగ్గా లేకపోయినా, లూజ్ అయినా ఆవిరి అక్కడి నుంచే లీకవుతుంది. దీనివల్ల సరైన ప్రెజర్ ఏర్పడదు.
4. కుక్కర్, మూత అంచులు వంకర కావడం
కుక్కర్ కింద పడినప్పుడు లేదా గోడలకు తగిలినప్పుడు అంచులు వంగిపోతుంటాయి. అప్పుడు మూత సరిగ్గా కూర్చోదు. అప్పుడు చిన్న గ్యాప్ ఏర్పడినా కుక్కర్‌లో నుంచి ప్రెజర్ లీక్ అవుతుంది.
5. తగినంత నీరు లేకపోవడం
వంట చేసేటప్పుడు కొంతమంది తక్కువ నీటిని పోస్తుంటారు. అలా తక్కువ నీరు ఉన్నప్పుడు ఆవిరి తయారవ్వదు. దీంతో విజిల్ రాదు.. పైగా నీరు తక్కువగా ఉండటం వల్ల వంట కూడా మాడిపోతుంది. అలాగే కుక్కర్ ఓవర్‌లోడ్ అయినప్పుడు కూడా ఆవిరి లోపల సర్క్యులేట్ అవ్వదు. అప్పుడు కూడా విజిల్ రాదు
6. మంట తక్కువగా ఉండటం
తక్కువ మంట మీద కుక్కర్‌ను పెడితే ప్రెజర్ బిల్డ్ అవ్వడానికి సమయం పడుతుంది. దీనివల్ల విజిల్ రావడం ఆలస్యమవుతుంది.
Read More:
Pillow Cleaning Tips | దిండుపై నూనె మరకలు పోవట్లేదా.. ఇంట్లోనే ఉండే ఈ వస్తువులతో క్లీన్ చేసి చూడండి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram