Pillow Cleaning Tips | దిండుపై నూనె మరకలు పోవట్లేదా.. ఇంట్లోనే ఉండే ఈ వస్తువులతో క్లీన్ చేసి చూడండి!

Pillow Cleaning Tips | చాలామందికి పడుకునే ముందు నూనె పెట్టుకోవడం అలవాటు. కానీ దీనివల్ల పొద్దున లేచి చూసేసరికి దిండు కవర్ పసుపు రంగులోని, నూనె మరకలతో జిడ్డుగా మారిపోతుంది. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించడం ద్వారా ఈజీగా ఆ మరకలను పోగొట్టుకోవచ్చు.

Reported by: Chandram | జీవనశైలి | Apr 04, 2026, 11:38 pm IST
Read Time: 4 mins
Pillow Cleaning Tips | దిండుపై నూనె మరకలు పోవట్లేదా.. ఇంట్లోనే ఉండే ఈ వస్తువులతో క్లీన్ చేసి చూడండి!

Pillow Cleaning Tips | చాలామందికి పడుకునే ముందు నూనె పెట్టుకోవడం అలవాటు. కానీ దీనివల్ల పొద్దున లేచి చూసేసరికి దిండు కవర్ పసుపు రంగులోని, నూనె మరకలతో జిడ్డుగా మారిపోతుంది. ఎంత పిండినా ఆ నూనె మరకలు అలాగే ఉండటంతో దిండు కవర్లను మార్చేస్తుంటారు. ఇకపై ఆ బాధ అక్కర్లేదు.. ఇంట్లోనే ఉండే వస్తువులతో ఈ టిప్స్ పాటిస్తే సింపుల్‌గా మరకలను తొలగించుకోవచ్చు.

బేకింగ్ సోడా

దిండుపై ఉన్న నూనె మరకలు పోవాలంటే ముందుగా కొద్దిగా బేకింగ్ సోడా చల్లాలి. 30 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచినప్పుడు.. బేకింగ్ సోడా ఆయిల్‌ను పీల్చేస్తుంది. తర్వాత మెల్లగా రుద్ది కడిగితే మరకలు తగ్గుతాయి.

నిమ్మరసం

నిమ్మరసం కూడా ఆయిల్ మరకలు తొలగించేందుకు సహజ క్లీనర్‌గా పనిచేస్తుంది. నిమ్మరసం కలిపిన నీటిలో దిండును అరగంట నానబెట్టిన తర్వాత, రుద్ది కడిగితే మరకలు పోతాయి.

డిష్‌వాష్ లిక్విడ్ – డిటర్జెంట్ 

విమ్ వంటి డిష్‌వాష్ లిక్విడ్ సైతం ఆయిల్ మరకలపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మరకపై నేరుగా విమ్ లిక్విడ్ పూసి, కొద్దిసేపు ఉంచిన తర్వాత కడిగితే మరకలు పోతాయి. డిటర్జెంట్ కూడా ఆయిల్ మరకలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఒక బకెట్ నీటిలో డిటర్జెంట్ కలిపి 2 నంచి 3 గంటల పాటు నానబెట్టి తర్వాత బాగా రుద్దాలి. మరకలు ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటితో కడగాలి.

ఇవే కాకుండా మరకలపై ముందుగా కార్న్ స్టార్చ్ లేదా టాల్కం పౌడర్ వేసి కొంతసేపు ఉంచాలి. అప్పుడు అది నూనె పీల్చి త్వరగా శుభ్రం చేస్తుంది.

అయితే ఈ చిట్కాలు పాటించేప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. నిమ్మరసం డైరెక్ట్‌గా కలర్ ఫ్యాబ్రిక్‌పై వాడితే రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే నీటిని ఎక్కువ మొత్తంలో కలపాలి. అలాగే చాలా మరుగుతున్న నీటిలో బట్టలను ఎక్కువసేపు నానబెడితే ఫ్యాబ్రిక్ దెబ్బతినొచ్చు. పాత మరకలు ఒకేసారి పోవాలని మరీ గట్టిగా రుద్దవద్దు. హార్ష్ కెమికల్స్‌ను వాడొద్దు. కాబట్టి దిండు కవర్లను తరచూ ఉతకడం కంటే కూడా తలకు నూనె రాసుకున్నప్పుడు నెత్తికి కవర్లు వాడటం మంచిది.

Read More:

చక్కటి కలలతో సుఖవంతమైన నిద్ర.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

అర్ధరాత్రి నిద్రాభంగమా? ఈ చిన్న టిప్స్ పాటిస్తే రాత్రంతా ప్రశాంతమైన నిద్ర ఖాయం..