ఒక్క మారేడు చాలు..శివుడు, లక్ష్మీ ప్రసన్నం..ఆరోగ్యం!
బిల్వదళం(మారేడు) పూజలతో శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం పొందవచ్చంటారు పూర్వీకులు. మారేడు దళం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానవుడి ఆరోగ్య రక్షణలో మారేడు దళాలకు ఉన్న శక్తిని పూర్వీకులు గొప్పగా వివరించారు.
విధాత : హిందూ పూజాధికాలలో బిల్వ పత్రాలుగా పిలిచే మారేడు ఆకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. పరమశివుడుకి ఒక్క మారేడు పత్రం, చెంబు నీళ్లు సమర్పిస్తే చాలు ప్రసన్నం అవుతాడని భక్తుల విశ్వాసం. ఏకబిల్వం శివార్పణం’ అని మారేడు దళాలతో శివుడిని పూజిస్తారు. దేవతా వృక్షాలుగా కీర్తించబడే వాటిలో మారేడు ప్రసిద్ది. లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడు పూజతో ఆర్థికంగా కలిసివస్తుందంటారు. అయితే బిల్వదళం(మారేడు) కేవలం పూజకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలామంచిదని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మానవుడి ఆరోగ్య రక్షణలో మారేడు దళాలకు ఉన్న శక్తిని పూర్వీకులు గొప్పగా వివరించారు.
లక్ష్మీదేవి తన కుడి చేతితో మారేడు చెట్టును సృష్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమని, మారేడు కాయలు శ్రీఫలాలని అంటారు. మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేది చాలమంది విశ్వాసం. మన పురాణాల్లో చెప్పబడ్డ ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం కూడా ఒకటి. పువ్వులు పూయకుండానే కాయలు కాయడం మారేడు విశిష్టతగా చెప్పవచ్చు. అందుకే దీన్ని వనస్పతి అని కూడా పిలుస్తారు.
ఒక్క మారేడు తింటే చాలు…శరీరంలో అద్బుతాలు !
వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే చాలు.. శరీరంలో జరిగే అద్భుతాలు జరుగుతాయని, బోలెడు ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అసలు బిల్వదళంలో ఉండే పోషకాలేంటి? దీన్ని వేసవిలో రోజూ ఉదయమే తీసుకుంటే కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు నమలడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను కషాయం రూపంలో తీసుకున్న కూడా అద్భుత ఫలితాలినిస్తుందని చెబుతున్నారు. మారేడు ఆకులో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు, విటమిన్లు A, C, B1, B6 పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఈ మారేడు ఆకు మనుషుల్లో ఇమ్యూనిటీని పెంచుతుంది. మారేడు ఆకులను తింటే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు అని సూచిస్తున్నారు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు
బిల్వ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మారేడు ఆకులను తింటే బీపీ తగ్గుతుంది. గుండె సమస్యలు రావు. మారేడు ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ ఆకుల్లో లభించే సమ్మేళనాలు షుగర్‌ను అదుపు చేస్తాయి. మారేడు ఆకులను నమలడం వల్ల కాలేయం ఆరోగ్యంగా మారుతుంది. కాలేయంలోని టాక్సిన్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఉదయాన్నే మారేడు ఆకులను నమలడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది. శ్వాసకోస సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా కంట్రోల్ అవుతుంది.
మారేడు ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఈ ఆకులను నమలడం వల్ల మలబద్దకం, అజీర్తి నుంచి దూరంగా ఉండొచ్చు. మారేడు ఆకులను ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోని మలినాలు అన్నీ బయిటకు పోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. బాడీ డీటాక్స్ అవుతుంది. మరి ఇన్ని లాభాలు ఉన్న మారేడు ఆకులతో స్వామి కార్యం(పరమ శివుడిని, లక్ష్మి కటాక్షం), స్వ కార్యం(వ్యక్తిగత ఆరోగ్యం) సిద్దించుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
అయితే మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదట. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. బుధ, శనివారాల్లో మాత్రమే మారేడు పత్రాలను కోయాలట. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి తిథుల్లో కూడా బిల్వాలను కోయకూడదట. సంధ్యా సమయం, రాత్రి వేళలలో, శివరాత్రి రోజున కూడా మారేడు పత్రాలను కోయవద్దని చెబుతారు.
మారేడు కాయ కూడా ఆరోగ్య ప్రదాయిని
మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. లక్ష్మీ దేవి సృష్టించిన ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలం’ అని పిలుస్తారు. మారేడు కాయఅద్భుతమైన ఔషధ గుణాలున్న ఫలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, ముఖ్యంగా డయేరియా, మలబద్ధకం, పేగు పూత, సమస్యలను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. రక్తశుద్ధీ చేసి, కోలస్ట్రోల్ తగ్గించి గుండె జబ్బులను నియంత్రిస్తుంది. వేసవిలో శరీరానికి చలువ చేసి, తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండిన మారేడు పండు గుజ్జును నీటిలో కలిపి, వడపోసి, కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకుంటే చలువ చేస్తుంది. పండును ఎండబెట్టి పొడి చేసి, నీటిలో కలుపుకుని తాగవచ్చు. మారేడు గుజ్జును నీటిలో నానబెట్టి, బెల్లం కలిపి తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి. డయేరియాను అరికట్టడంలో ఇది బాగా పనిచేస్తుంది. వేసవికాలంలో మారేడు జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, చల్లదనం కలుగుతుంది.
ఇవి కూడా చదవండి :
పెరిగిన బంగారం, వెండి ధరలు
Leopard | అత్త గదిలోకి తొంగిచూడగా.. ఉలిక్కిపడ్డ కోడలు పిల్ల
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram