Household Tips | ఫ్రిజ్‌లో నుంచి దుర్వాసన వస్తుందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యను దూరం చేయండి!

ఫ్రిజ్‌ డోర్ తీసినప్పుడు దుర్వాసన ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ సమస్యను మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్‌గా పరిష్కరించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Household Tips | ఫ్రిజ్‌లో నుంచి దుర్వాసన వస్తుందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యను దూరం చేయండి!

Household Tips | వేసవికాలంలో ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది. ఫ్రిజ్ డోర్ తెరిచినప్పుడల్లా వచ్చే ఈ వాసన అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడం చాలా ఈజీ. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే రిఫ్రిజిరేటర్‌ను తాజాగా ఉంచుకోవచ్చు.

దుర్వాసనకు కారణమేంటి?

చాలామంది ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలతో పాటు అనేక వస్తువులను ఉంచుతారు. దీంతో ఫ్రిజ్ ఫుల్లుగా స్టోర్ అవ్వడం వల్ల చల్లటి గాలి ప్రసరించదు. దీంతో ఫ్రిజ్‌లో ఉంచిన ఆహార పదార్థాలు, వస్తువుల నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పుడప్పుడు కర్రీ లేదా పాలను ఫ్రిజ్‌లో పెట్టి అలాగే మరిచిపోతాం. అలా కొన్ని ఫుడ్స్ ఎక్కువ రోజులు నిల్వ చేయడం వల్ల అవి రిఫ్రిజిరేటర్‌లోనే కుళ్లిపోయి వాసన వస్తాయి. అదేవిధంగా కట్ చేసిన కూరగాయలు, పండ్లు ఎక్కువసేపు ఉంచినా వాసన వస్తుంది. మాంసాహారం, సంబంధిత పదార్థాలను సరిగ్గా కవర్ చేయకుండా ఉంచితే వాటి వల్ల ఇతర పదార్థాలు కూడా వాసన పడతాయి. ఫ్రిజ్‌లో కిందపడిపోయిన ద్రవాల ద్వారా కూడా బ్యాక్టీరియా పెరిగి దుర్వాసనకు దారితీస్తుంది.

ముందుగా ఫ్రిజ్ క్లీన్ చేయాలి!

రిఫ్రిజిరేటర్‌లో నుంచి ఇలా వాసన వచ్చినప్పుడు ముందుగా దాన్ని ఖాళీ చేయాలి. ఫ్రిజ్‌లో ఉన్న అన్ని ట్రేలు, బాక్సులను పూర్తిగా ఖాళీ చేయాలి. పాడైన లేదా పాత ఆహారాన్ని వెంటనే తొలగించాలి. అనంతరం గోరువెచ్చటి నీటిలో బేకింగ్ సోడా కలిపి ఒక బట్టతో ఫ్రిజ్ లోపలి భాగాన్ని బాగా తుడవాలి. బేకింగ్ సోడా సహజమైన క్లీనర్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఇది దుర్వాసనను గ్రహించడమే కాకుండా బ్యాక్టీరియాను తగ్గిస్తుంది ఫ్రిజ్‌లో దుర్వాసన రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. వారానికి కనీసం ఒక్కసారి ఫ్రిజ్‌లో ఖాళీ చేసి గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి లోపలి భాగాన్ని తుడవాలి.

బేకింగ్ సోడా

రిఫ్రిజిరేటర్ నుంచి తరచూ దుర్వాసన వస్తుంటే.. ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా నింపి రిఫ్రిజిరేటర్‌లో ఒక మూలన ఉండాలి. ఇది పొడి గాలిలో ఉండే దుర్వాసన కలిగించే కణాలను గ్రహిస్తుంది. రిఫ్రిజిరేటర్‌ను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది.

నిమ్మకాయ – వెనిగర్

రిఫ్రిజిరేటర్‌లోని దుర్వాసనను తొలగించడంలో నిమ్మకాయ, వెనిగర్ చాలా ఉపయోగపడతాయి. నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్ లోపల పెడితే ఫ్రెష్ వాసన వస్తుంది. కావాలంటే నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి వాడితే ఇంకా త్వరగా ఫలితం కనిపిస్తుంది. అలాగే ఒక చిన్న గిన్నెలో వెనిగర్ పోసి ఫ్రిజ్‌లో ఉంచినా సరిపోతుంది.

టూత్ పేస్ట్ – కర్పూరం

ఒక గిన్నెలో తెల్లటి టూత్ పేస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత నాలుగు కర్పూరం బిళ్లలను పొడి చేసి అందులో కలపాలి. ఆ గిన్నెను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, దాదాపు అరగంట సేపు ఉంచాలి. దీనివల్ల ఫ్రిజ్‌లోని దుర్వాసనను అది గ్రహిస్తుంది. అప్పుడు ఫ్రిజ్ డోర్ తెరిస్తే మంచి వాసన వస్తుంది. టూత్ పేస్ట్, కర్పూరం పొడి మిశ్రమంలో నిమ్మరసం కలిపి, చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. ఈ ముద్దలను ఫ్రిజ్‌లో అక్కడక్కడ ఉంచినా మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు

ఈ చిట్కాలు పాటించడంతో పాటు మన అలవాట్లలో చిన్న చిన్న అలవాట్లను పాటిస్తే ఫ్రిజ్‌లో దుర్వాసన సమస్యను పరిష్కరించవచ్చు. అవేంటంటే..

  • ఆహారా పదార్థాలు, పానీయాలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచకూడదు. పాడైపోతున్నాయి అని అనిపించగానే బయటకు తీసేయాలి.
  •  ఫ్రిజ్‌లో ఉంచిన ఏవైనా ద్రవ పదార్థాలు ఒలికినప్పుడు అలాగే వదిలేయకుండా.. పొడిబట్టతో అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి.
  •  ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు కచ్చితంగా మూతలు పెట్టాలి. వీలైతే మూసి ఉండే కంటైనర్లను వాడటం ఇంకా బెటర్
  •  అలాగే రిఫ్రిజిరేటర్‌ను కనీసం 10 రోజులకు ఒకసారైనా ఖాళీ చేసి, గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా కలిపి లోపలి భాగాన్ని తుడవాలి. ఈ
  • సింపుల్ చిట్కాలు వాడటం వల్ల ఫ్రిజ్‌ను ఎప్పుడూ ఫ్రెష్‌గా, దుర్వాసన రాకుండా ఉంచుకోవచ్చు.

Read More:

Potato Storage Tips | ఆలుగడ్డలు తొందరగా పాడైపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటాయి!

Potato Storage Tips | ఆలుగడ్డలు తొందరగా పాడైపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటాయి!