KCR SIT inquiry| రేపు సిట్ విచారణకు రాలేను : కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు శుక్రవారం విచారణకు సిద్దంగా ఉండాలన్న సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో తాను బిజీగా ఉన్నానని, రేపు విచారణకు రాలేనని సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చారు.
విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు శుక్రవారం విచారణకు సిద్దంగా ఉండాలన్న సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో తాను బిజీగా ఉన్నానని, రేపు విచారణకు రాలేనని సిట్ నోటీసులకు రిప్లై ఇచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు. సిట్ నోటీసులపై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావు సహా పార్టీ ముఖ్యులతో చర్చించిన కేసీఆర్ సిట్ నోటీసులపై లిఖిత పూర్వకంగా స్పందించారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో విచారించండి
మాజీ సీఎంగా విచారణకు సహకరిస్తానని, అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు విచారణకు రాలేనని సిట్ కు కేసీఆర్ బదులిచ్చారు. విచారణ వాయిదా వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణ జరుపాలని కేసీఆర్ కోరారు. రాజకీయ ఒత్తిడి లేకుండా సిట్ వ్యవహరించాలని, 65ఏళ్లు పైబడిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలవరాదని చట్టంలో ఉందని, సీఆర్పీసీ చట్టం 160మేరకు ఇంటివద్దనే విచారించాలని, తనను ఎర్రవెల్లి ఫామ్ హాౌస్ లో విచారించాలని కోరారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్ అడ్రస్ కే ఇవ్వాలని కోరారు.
రేపు కేసీఆర్ కు సిట్ మరో నోటీసు ?
ఇప్పటికే కేసీఆర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు నందినగర్ నివాసంలో కేసీఆర్ ను విచారించేందుకు సిద్దమైన సిట్..కేసీఆర్ రేపు విచారణకు రాలేనంటూ లేఖ రాయడంతో విచారణను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ లేఖలో ప్రస్తావించిన అంశాల మేరకు ఆయనకు విచారణకు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. లీగల్ ఒపినియన్ తర్వాతా రేపు కేసీఆర్ కు సిట్ మరో నోటీసుతో పాటు ఆయన రాసిన లేఖలోని అంశాలకు సమాధానం ఇవ్వనున్నట్లుగా సిట్ వర్గాలు తెలిపాయి. రేపటి నోటీసులు నందినగర్ నివాసం అడ్రస్ తోనే ఇస్తారని, శాసన సభ సమాచారం మేరకు అదే అడ్రస్ ఉన్నందునా అక్కడి అడ్రస్ కే నోటీసులు జారీ చేయాలని సిట్ భావిస్తుంది. అయితే కేసీఆర్ ను తదుపరి విచారించే తేదీపైన సస్పెన్స్ కొనసాగుతుంది. రేపు జారీ చేయబోయే నోటీసులో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram