Cheating Husband | నెలకు 85 వేల ఇచ్చి నా భర్తను నువ్వే ఉంచుకో.. ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చిన భార్య

Cheating Husband | తన భర్త ఎఫైర్ బయటపడటంతో థాయ్‌లాండ్ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.85వేలు అద్దె చెల్లించి తన భర్తను ఉంచుకోమని భర్త ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌‌మీడియాలో వైరల్‌గా మారింది.

Reported by: Chandram | వైరల్ న్యూస్ | Mar 15, 2026, 11:28 pm IST
Read Time: 5 mins
Cheating Husband | నెలకు 85 వేల ఇచ్చి నా భర్తను నువ్వే ఉంచుకో.. ప్రియురాలికి షాకింగ్ ఆఫర్ ఇచ్చిన భార్య

Cheating Husband | మహిళలు ఏదైనా పంచుకుంటారు కానీ భర్తను పంచుకోవాలంటే మాత్రం ఒప్పుకోరు.. తనను పెళ్లాడిన తర్వాత వేరే అమ్మాయితో చనువుగా ఉంటే తట్టుకోలేరు. అదే భర్త ఎఫైర్ బయటపెడితే పెద్ద గొడవలు అయిపోతాయి. కానీ థాయ్‌లాండ్‌లో మాత్రం భర్త ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలియడంతో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నెలకు రూ.85వేలు ఇచ్చి తన భర్తను ఉంచుకోమని ప్రియురాలికి బంపరాఫర్ ఇచ్చింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌‌మీడియాలో వైరల్‌గా మారింది.

థాయ్ టాక్ షో హోన్ క్రాసెయి‌లో ఖున్ క్వాంగ్ అనే మహిళ తన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలేమైందంటే.. ఖున్ క్వాంగ్ తన 21 ఏళ్ల వయసులో ఓ పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. దాదాపు పదేళ్ల పాటు వారి జీవితం ప్రశాంతంగా సాగింది. వారి ప్రేమకు ఫలితంగా ఒక బాబు కూడా పుట్టాడు. అతని వయసు 8 ఏళ్లు. అయితే 2025 మధ్యలో అంతా మారిపోయింది. సోషల్‌మీడియాలో ఒక అపరిచిత మహిళను తన భర్త ఫాలో అవ్వడం గమనించింది. దానిపై అనుమానం వచ్చినప్పటికీ భర్తను ప్రశ్నించలేదు.

ఆ కొద్దిరోజుల్లోనే భర్త నడవడికలో తేడా వచ్చింది. ఇంటికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు. ఒక్కోసారి రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చేవాడు. దీనిపై ప్రశ్నించగా.. నాకు ఈ సంసారం వదవ్దు.. నువ్వు వద్దు.. ఈ ఇల్లు, కారు ఏదీ వద్దు.. అన్ని ఇచ్చేసి వట్టి చేతులతో వెళ్లిపోతానంటూ వైరాగ్యంలో ఉన్నట్లుగా మాట్లాడాడు. దీంతో ఖున్ క్వాంగ్‌కు అనుమానం మరింత ఎక్కువైంది. భర్త ప్రవర్తనకు అసలు కారణం తెలుసుకోవడానికి ప్రైవేటు డిటెక్టివ్‌తో ఎంక్వైరీ చేయించింది.

ప్రైవేట్ డిటెక్టివ్‌తో చేయించిన ఎంక్వైరీలో అసలు విషయం బయటపడింది. క్వాంగ్ భర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో భర్తను బెదిరించి, తన ఇంటికి వచ్చేలా క్వాంగ్ చేసుకుంది. కానీ ఆమె భర్త మాత్రం ప్రియురాలిని మరిచిపోలేదు. రాత్రిపూట లేచి ఇదే విషయాన్ని క్వాంగ్‌కు చెప్పి ఆవేదన వెల్లగక్కాడు.

అప్పుడే క్వాంగ్‌కు ఒక విచిత్ర ఆలోచన వచ్చింది. దీంతో భర్త ప్రియురాలిని పిలిచి ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేసింది. నీకు నా భర్త కావాలి కదా.. అయితే అతడిని నీకు అద్దెకు ఇస్తాను అందుకు నాకు మీరు ఇద్దరూ కలిసి నెలకు 30 వేల బాట్(భారత కరెన్సీలో సుమారు రూ.85 వేలు) చెల్లించాలని క్వాంగ్ ప్రతిపాదన పెట్టింది. దీనికి భర్త తిరస్కరించినప్పటికీ.. అతడి ప్రియురాలు ఒప్పుకోవడం గమనార్హం.

ఇప్పుడు భర్తను లీజ్‌కు ఇచ్చే ఒప్పందం ( Husband Lease Agreement ) థాయ్‌లాండ్‌లో వైరల్‌గా మారింది. ఇలాంటి ఒప్పందాలకు థాయ చట్టంలో ఎటువంటి చట్టపరమైన గుర్తింపు లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇది సామాజిక నైతిక విలువలకు వ్యతిరేకమని నిపుణులు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Read More :