Hospital Bill | లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!

Hospital Bill | ఆస్పత్రిలో మెడికల్ బిల్లుపై జరిగిన మోసం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పేషెంట్ అడిగిన ఒక్క ప్రశ్నతో రూ.లక్ష రూపాయల బిల్లు కాస్త.. 57వేలకు తగ్గించడం పెద్ద చర్చకు దారితీసింది.

Reported by: Chandram | ట్రెండింగ్ | Mar 19, 2026, 8:57 pm IST
Read Time: 5 mins
Hospital Bill | లక్ష రూపాయల ఆస్పత్రి బిల్లు.. ఒక్క ప్రశ్నతో 57 వేలకు తగ్గింది.. వైరల్ ఘటన!

Hospital Bill | హాస్పిటల్‌లో బిల్లు కట్టేటప్పుడు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో అని ఎప్పుడైనా చూసుకున్నారా? తాజాగా సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఓ పోస్టు ఆస్పత్రుల్లో జరిగే మోసాలపై భారీ చర్చకు దారి తీసింది. ఒక పేషెంట్‌కు సంబంధించిన ఒకరు తమకు వచ్చిన హాస్పిటల్ బిల్లుకు సంబంధించి, ఒక్క ప్రశ్న అడగ్గానే బిల్లు సగానికి తగ్గిపోయింది.!

సోషల్‌మీడియాలో పోస్టు చేసిన దాని ప్రకారం.. ఒక వ్యక్తి చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి ట్రీట్‌మెంట్ తర్వాత డిశ్చార్జి అయ్యేటప్పుడు సుమారు లక్ష రూపాయల బిల్లు ఇచ్చారు. నిజంగానే అంత అయ్యి ఉండొచ్చని భావించిన పేషెంట్.. ఆ మొత్తాన్ని కట్టి, ఈఎంఐ పెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే అక్కడకు వచ్చిన అతని సహోద్యోగి ఒక చిన్న సలహా ఇచ్చాడు. బిల్లు కట్టడానికి ముందు ఐటమైజ్‌డ్ బిల్లు అడగమని చెప్పాడు.

తన తోటి ఉద్యోగి ఇచ్చిన సలహా మేరకు ఆస్పత్రి సిబ్బంది అడిగి ఐటమైజ్‌డ్ బిల్లు తీసుకున్నాడు. ఆరు పేజీల బిల్లును పరిశీలించగా షాకింగ్ విషయాలు తెలిశాయి. సదరు వ్యక్తి చేయించుకొని చికిత్స, మెడిసిన్స్‌కు సంబంధించిన చార్జిలు కూడా బిల్లులో ఉన్నాయి. అంతేకాదు ఒకే మెడికల్ సప్లయి కిట్‌కు రెండుసార్లు చార్జి చేశారు. ఇవన్ని గమనించిన అతను.. ఆస్పత్రి సిబ్బంది అడిగారు.

పేషెంట్, అతని బంధువులు వీటిపై ప్రశ్నించడంతో ఆస్పత్రి సిబ్బంది తప్పించుకునే ప్రయత్నం చేశారు. సాంకేతిక పొరపాటు కారణంగా తప్పుడు బిల్లు వచ్చి ఉంటుందని కవర్ చేసుకున్నారు. అదనంగా చేర్చిన చార్జిలను బిల్లు నుంచి తొలగించారు. దీంతో రూ.లక్షల రూపాయలు వచ్చిన బిల్లు రూ.57 వేలకు పడిపోయింది. అంటే దాదాదాపు సగం సేవ్ అయ్యింది. తనకు జరిగిన ఈ ఘటనను ఆ వ్యక్తి సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. అది కాస్త వైరల్‌గా మారింది.

సోషల్‌మీడియాలో వైరల్‌గా అయిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైద్యం అనేది సేవ అయినప్పటికీ.. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు లాభాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బిల్లులు రావడం కామన్ అని.. మనమే అప్రమత్తంగా ఉండాలని.. ఎప్పుడూ ఐటమైజ్‌డ్‌ బిల్లు అడగాలని సూచిస్తున్నారు.

Read More :

Pre Wedding Shoot | సూసైడ్ కాదు.. ప్రీ వెడ్డింగ్ షూట్.. చెరువులో శవల్లా కొత్త జంట ఫోజులు చూసి నెటిజన్లు షాక్!