Nellore : కూల్ డ్రింక్స్ లారీ బోల్తా…10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం

నెల్లూరులో కూల్‌డ్రింక్స్ లారీ బోల్తా పడగా, జనం 10 నిమిషాల్లోనే బాటిల్స్ ఎత్తుకెళ్లారు. డ్రైవర్ పరిస్థితిని పట్టించుకోకపోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Nellore : కూల్ డ్రింక్స్ లారీ బోల్తా…10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం

విధాత : మద్యం, కూల్ డ్రింక్స్, పాల లోడ్ లతో వెళ్లే లారీలు బోల్తా పడితే జనాలు ఊరుకోరు అనడానికి…ఏపీలో ఓ కూల్ డ్రింక్స్ లారీ బోల్తా ఘటన నిదర్శనంగా నిలిచింది. నెల్లూరు జిల్లా బుజ‌బుజ్జ జాతీయ‌ ర‌హ‌దారిపై కూల్ డ్రింక్స్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలోని కూల్‌డ్రింక్స్ బాటిళ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై పడిన కొన్ని బాటిళ్లు పగిలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమీప ప్రాంతాల ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని అందిన‌కాడికి..తమ శక్తి మేరకు సంచుల్లో బాటిల్స్ ఎత్తుకెళ్లారు. ప‌ది నిమిషాల్లోనే జనం కూల్ డ్రింక్స్ స్టాక్ ఖాళీ చేసేశారు. ప్రమాదంలో డ్రైవర్ కు స్పల్ప గాయాలయ్యాయి.

అయితే లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌ ఎలా ఉన్నాడో కూడా చూడకుండా జనం కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఎత్తుకెళ్లే పనిలో హడావుడి చేయడం అమానుషంగా ఉందని నెటిజనట్లు కామెంట్స్ చేస్తున్నారు. సాయం చేయాల్సింది పోయి ఇలా దోపిడి చేయడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Heavy Rains Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన
గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?