సర్కార్ టీచర్ ఉద్యోగానికి భూక్యా గౌతమి రాజీనామా

రీల్స్‌తో గుర్తింపు పొందిన ఖమ్మం ప్రభుత్వ టీచర్ భూక్యా గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేశారు. డీఈఓ వేధింపుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని వీడియోలో వెల్లడించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 03, 2026, 3:35 pm IST
Read Time: 3 mins
సర్కార్ టీచర్ ఉద్యోగానికి భూక్యా గౌతమి రాజీనామా

రీల్స్‌తో గుర్తింపు పొందిన ఖమ్మం ప్రభుత్వ టీచర్ భూక్యా గౌతమి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తన ఉద్యోగానికి రాజీనామా అంశాన్ని వెల్లడిస్తూ ఆమె సెల్పీ వీడియో రిలీజ్ చేశారు. డీఈఓ వేధింపుల వల్లే నా టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం భూక్యా గౌతమి వీగియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలియక ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ రీల్స్ చేసినందుకు తనను సస్పెండ్ చేశారని, అంతకంటే పెద్ద తప్పులు చేసిన వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకున్నారని, నన్ను మాత్రం తీవ్రంగా వేధించి ఆరు నెలల తర్వాత తిరిగి పోస్టింగ్ ఇచ్చారని గౌతమి వాపోయారు. ఓ గిరిజన బిడ్డగా పేదరికం నుంచి వచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఎంతో కష్టపడి సంపాదించుకున్నానని, పేద బిడ్డలకు సేవ చేయాలనుకున్నానని, కాని తెలియక చేసిన తప్పుకు శిక్షకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా డీఈఓ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నందువల్లే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు భూక్యా గౌతమి స్పష్టం చేశారు. భూక్యా గౌతమి పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరుపై గిరిజన సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.