విధాత : అడవిలో తిరుగాల్సిన భారీ కొండ చిలువ రోడ్డుపై సంచరిస్తూ వాహనదారులను, జనాన్ని హడలెత్తించింది. ఏపీలోని పెద్దాపురం రోడ్డుపై భారీ కొండచిలువ సంచారం స్థానికుల్లో, వాహనదారులలో భయాందోళన రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట వద్ద రోడ్డుపై భారీ కొండచిలువ కనిపించడంతో వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
కొండచిలువ నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, స్థానికులు దూరం నుంచి గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించారు. ఓవైపు భయపడుతునే..మరోవైపు కొండ చిలువను తమ సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు.
🐍 పెద్దాపురం రోడ్డుపై భారీ కొండచిలువ.. స్థానికుల్లో భయాందోళన
📍 కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట వద్ద రోడ్డుపై భారీ కొండచిలువ కనిపించడంతో వాహనదారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
⚠️ కొండచిలువ నెమ్మదిగా రోడ్డు దాటుతుండటంతో కొద్దిసేపు ట్రాఫిక్… pic.twitter.com/MlhcBgL1tJ
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 24, 2026