ఆన్ లైన్ ఎమోజీల వెనుక అర్థాలపై సైబర్ క్రైమ్ అలర్ట్ ఫోగ్రామ్

ఈ రోజుల్లో యువతను ప్రలోభపెట్టడానికి, ఆకర్షించడానికి ఎలాంటి ఎమోజీలను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా పిల్లలను ఆన్‌లైన్ వేటగాళ్ల నుండి రక్షించండంటూ తల్లిదండ్రులకు తెలంగాణ పోలీస్ శాఖ అవగాహాన కల్పిస్తుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 25, 2026, 11:53 am IST
Read Time: 2 mins
ఆన్ లైన్ ఎమోజీల వెనుక అర్థాలపై సైబర్ క్రైమ్ అలర్ట్ ఫోగ్రామ్

విధాత : సోషల్ మీడియా విచ్చలవిడి కొనసాగుతున్న ఈ రోజుల్లో ఆన్ లైన్ లలో సందేశాలు, సమాచార పంపిణీలో భాగంగా ప్రజలు, యువత, విద్యార్ధులు, పిల్లలు అనేక మెసేజ్ లను, వీడియోలను చూస్తుంటారు. అయితే ఏ ఏమోజీని ఏ సందేశం తెలుపడానికి ఉపయోగిస్తారో తెలియకపోవడంత చాల మంది పిల్లలు ఆన్ లైన్ వేధింపుల ఉచ్చులో పడుతున్నారు.

ఈ సమస్య నివారణ దిశగా తెలంగాణ పోలీస్ శాఖ పిల్లలు ఆన్‌లైన్‌లో చూసే రోజువారీ ఎమోజీల వెనుక దాగి ఉన్న అర్థాల గురించి మీకు తెలుసా? అంటూ సోషల్ మీడియా వేదికగా అలర్ట్ ఫోగ్రామ్ క్యాంపెయిన్ చేపట్టింది. ఈ రోజుల్లో యువతను ప్రలోభపెట్టడానికి, ఆకర్షించడానికి ఎలాంటి ఎమోజీలను ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా  పిల్లలను ఆన్‌లైన్ వేటగాళ్ల నుండి రక్షించండంటూ తల్లిదండ్రులకు తెలంగాణ పోలీస్ శాఖ, సైబరాబాద్ పోలీస్ విభాగం అవగాహాన కల్పిస్తున్నారు. పోలీసుల క్యాంపెయిన్ చూసిన చాలమంది ఎమోజీల వెనుక ఇంతకథ దాగి ఉందా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.