తనపై వేధింపులకు సంబంధించి ఓ ఇంటర్య్యూలో బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కళ్లపల్లి ప్రతిభ..తను గతంలో ఎదుర్కోన్న వేధింపులకు సంబంధించి మరింత వివరణతో వీడియో విడుదల చేసింది. 2022లో అప్పటి క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనను బెదిరించారని, 2023లో మీడియా ముందుకు వచ్చిన తర్వాత “మీ పేరెంట్స్ ఎక్కడున్నారో తెలుసు” అంటూ బెదిరింపులకు పాల్పడి.. ఫార్చ్యూనర్ కార్లలో మా కుటుంబాన్ని ఫాలో చేయడం జరిగిందని ఆరోపిస్తోంది.
మైనర్ అథ్లెట్ల విషయంలో ఇలాంటి సమస్యలు ఎదురవ్వడంతో వారిలో చాలామంది భయంతో మాట్లాడలేకపోయారని, ఇలాంటి ఒత్తిళ్లు తట్టుకోలేక చాలామంది అథ్లెట్లు కెరీర్ వదిలేశారని ప్రతిభ తన వీడియోలో ఆరోపించింది. 18 సార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన తను దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట కోసం ఆడుతుంటే..ఇక్కడ మాత్రం నాతో పాటు పలువురు క్రీడాకారిణీలను బీఆర్ఎస్ మాజీ మంత్రి, పీఏలు వేధించారని ఆమె వెల్లడించారు. మంత్రి హస్తం లేకుండా..అతని పీఏ ఓ అంతర్జాతీయ క్రీడాకారిణిని బెదిరించడం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ప్రతిభ వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్ కౌంటర్
క్రీడాకారిణి ప్రతిభ చేసిన కామెంట్స్‌పై మాజీ క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియా ముఖంగా స్పందించారు. మంత్రి పేషీలో పనిచేసే వ్యక్తి అని చెప్తే.. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కావాలని వీడియోను కట్ చేసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నందుకే నన్ను బీజేపీ, కాంగ్రెస్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయని విమర్శించారు.నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి అడ్వకేట్లతో మాట్లాడుతున్నానని తెలిపారు.
తప్పు ఆ అమ్మాయిదే… మా పార్టీ వాడు మాత్రం పతివ్రతుడు, ఏం తెలియని సుద్దపూస అన్నారుగా రా?
ఇప్పుడు అదే అమ్మాయి ఇంకో వీడియో పెట్టి మరింత క్లియర్‌గా చెప్పింది.
2022లో Sports Minister బెదిరించారని చెబుతోంది. 2023లో మీడియా ముందుకు వచ్చిన తర్వాత “మీ పేరెంట్స్ ఎక్కడున్నారో తెలుసు” అంటూ… pic.twitter.com/rN8NwEI6FI
— Sai Teja (@TejaSai884_) August 24, 2026