పసిడి పరుగు..అదే దారిలో వెండి ధరలు

శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,520 పెరిగి రూ.1,63,090 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,400 ధర రూ.1,49,500వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 10,000 పెరిగి రూ. 2,70,000 వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Aug 22, 2026, 12:26 pm IST
Read Time: 3 mins
పసిడి పరుగు..అదే దారిలో వెండి ధరలు

అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి.శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,520 పెరిగి రూ.1,63,090 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,400 ధర రూ.1,49,500వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 10,000 పెరిగి రూ. 2,70,000 వద్ద కొనసాగుతుంది.

మరింత పైకి వెళ్లనున్న బంగారం ధరలు ?

అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మార్పుల క్రమలో బంగారం ధర దూసుకెళ్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌ను అనూహ్యంగా పెంచడం, డాలర్‌ బలహీనపడటం, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధరల పెరుగుదలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. బలహీనమైన డాలర్‌ కారణంగా.. వడ్డీ రేటు పెంచకపోయినా పసిడి ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆగస్టులో ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధర దాదాపు 11 శాతానికి పైగా దూసుకెళ్లింది. 4,700 డాలర్ల స్థాయికి చేరుకుంది. అయితే బంగారం జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి 5,318.40 డాలర్లతో పోలిస్తే ఇంకా దాదాపు 15 శాతం తక్కువగానే ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులే కొనసాగితే.. జనవరి గరిష్టాన్ని తాకడంతో పాటు ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తులం బంగారం రూ.2 లక్షలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.