ఇదేం తీరు..దామరచర్ల హాస్టల్‌లో విద్యార్థులతో వంట పనులు!

నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ చపాతీలు చేయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 24, 2026, 3:59 pm IST
Read Time: 4 mins
ఇదేం తీరు..దామరచర్ల హాస్టల్‌లో విద్యార్థులతో వంట పనులు!

విధాత : పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన వయసులో ఆ విద్యార్ధులు వంట పనులు చేస్తున్నారు. చదువుకుందామని హాస్టల్ కు వచ్చిన విద్యార్ధులను హాస్టల్ లోని వంట పనుల సిబ్బందిగా మార్చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులతో ప్రిన్సిపాల్‌ చపాతీలు చేయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభుత్వం వంట మనుషులకు జీతాలు చెల్లిస్తున్నప్పటికీ విద్యార్థులతో వంట పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగుచూస్తుండటంపై అధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గురుకుల పాఠశాలలో సైతం విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్న సిబ్బంది నిర్వాకం కూడా వెలుగుచూసింది. హాస్టల్, వంట సిబ్బంది తీరుపై విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి.

స్వయంగా విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డినే ఉండటంతో ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది. లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలను తీసుకరావడం సంగతి ఎలా ఉన్నా..ముందుగా పేద విద్యార్దులు చదవుకునే గురుకుల హాస్టల్స్ లో నాణ్యమైన ఆహారం, విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలంటూ విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.