ఒక్క కాలితో బడికి.. సైకిల్ కోసం చిన్నారి వేడుకోలు

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన ఏడేళ్ల రాగిణి ప్రమాదంలో ఒక కాలు దెబ్బతిన్నా చదువుపై పట్టుదల వీడకుండా రోజూ బడికి వెళ్లుతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Sep 02, 2026, 2:21 pm IST
Read Time: 3 mins
ఒక్క కాలితో బడికి.. సైకిల్ కోసం చిన్నారి వేడుకోలు

విధాత, హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన ఏడేళ్ల రాగిణి ప్రమాదంలో ఒక కాలు దెబ్బతిన్నా చదువుపై పట్టుదల వీడకుండా రోజూ బడికి వెళ్లుతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మానియర్‌లోని ప్రైమరీ స్కూల్ దిఘేడాలో 1వ తరగతి చదువుతున్న రాగిణి.. ఇంటి నుంచి 400 మీటర్ల దూరంలోని పాఠశాలకు ఒక్క కాలిపై గెంతుతూ వెళ్తోంది.

పాఠశాలకు రాకపోకలపై తన ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రాగిణి.. డీఎం అంకుల్ తనకు సైకిల్ ఇప్పించాలని వేడుకుంది. “నేను ప్రతిరోజూ బడికి వస్తాను” నాకు ఓ ట్రై సైకిల్ ఇప్పించడంటూ రాగిణి చేసిన హృదయపూర్వక విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి విజ్ఞప్తికి ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి అడిగిన సైకిల్ ఇవ్వాలని నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. రాగిణి స్ఫూర్తిదాయక జీవితానికి అండగా నిలవాలని సూచిస్తున్నారు.