రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం

హదారి పక్కన ఒంటరిగా వెలుతున్న మహిళపై లైంగిక దాడికి తెగబడిన కామాంధుడికి వీధి శునకం బుద్ది చెప్పి..బాధిత మహిళకు రక్షణగా నిలిచిన ఘటన వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Sep 05, 2026, 12:29 pm IST
Read Time: 3 mins
రేపిస్ట్ నుంచి మహిళను కాపాడిన శునకం

విధాత : రహదారి పక్కన ఒంటరిగా వెలుతున్న మహిళపై లైంగిక దాడికి తెగబడిన కామాంధుడికి వీధి శునకం బుద్ది చెప్పి..బాధిత మహిళకు రక్షణగా నిలిచిన ఘటన వైరల్ గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో రోడ్డుపై ఒక మహిళ ఒంటరిగా వెళ్తుండటాన్ని గమనించి..ఓ కామాంధుడు ఆమెపై మృగంలా లైంగికదాడికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరన్న ధైర్యంతో.. ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. అక్కడ మనుషులు ఎవరూ లేకపోయినా నేనున్నా అంటూ.. ఓ వీధి శునకం హీరోలా ఆ రాక్షసుడిపై పోరాడింది. తనను ఆ మృగాడు కొడుతున్నా వెనక్కు తగ్గకుండా ఆ శునకం అతడిని ఎక్కడబడితే అక్కడ కొరికేసింది.

శునకం ధాటికి ఆ మహిళను వదిలి అతడు పరుగు లంఘించుకున్నాడు. కామాంధుడ్ని ఉరికించి.. అతని బారి నుంచి మహిళను కాపాడింది. అత్యాచారం నుంచి మహిళను రక్షించిన శునకం ఔన్నత్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీధి కుక్క ఆ బాధిత మహిళ పట్ల అపద్బాంధవుడిగా నిలిచిన తీరుతో.. వీధి కుక్కలతో ప్రమాదాలే కాదు..ప్రయోజనాలు కూడా ఉంటాయని కితాబినిస్తున్నారు.

జనావాసాల్లోకి గుర్తు తెలియని వ్యక్తులు, రాత్రి వేళ దొంగలుగాని, క్రూరమృగాలు గాని ప్రవేశిస్తే వీధి కుక్కలు అరిచి అప్రమత్తం చేస్తాయని, కుక్కనే కదా అని చిన్నచూపు చూడవద్దని.. మనుషులు చేయలేని ఎన్నో మంచిపనులు అవి చేస్తున్నాయని అభినందిస్తున్నారు.