విధాత : పాల డెయిరీ ట్రక్ పైన ఉన్న ఆవు బొమ్మను చూసి ఓ లేగదూడ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రహదారిపై వెళ్తున్న విజయా పాల డెయిరీ ట్రక్‌పై ఆవు చిత్రాన్ని చూసిన దూడ.. ఆది నిజమైన ఆవుగా భావించి, పాలు తాగేందుకు దాని వెనుక భాగంలోని ఆవు పొదుగును అందుకునేందుకు పదేపదే ప్రయత్నించింది.
అంబా అంటూ పిలుస్తూ ఆవు బొమ్మను నిజమైన ఆవుగా భావించి పాలు తాగేందుకు దూడ చేసిన ప్రయత్నాన్ని చూసిన వాహనదారులు అశ్చర్యపోయారు. ఆయ్యో పాపం ఆవుదూడకు ఎంత ఆకలిగా ఉందో..అలా బొమ్మ ఆవుకు పాలు తాగే ప్రయత్నం చేసిందనుకున్నారు. ఈ వైరవ్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ… ట్రక్ పై ఆవు బొమ్మ నిజమైన ఆవు మాదిరిగానే కనిపించడంతో.. దూడ అలా స్పందించిందని కామెంట్లు చేశారు.
ఆవు బొమ్మకు పాలు తాగేందుకు లేగ దూడ ఆరాటం.!
హై వే పై ఆగి ఉన్న ఓ ట్రక్‌పై ఆవు చిత్రాన్ని చూసి దూడ.. దాని పొదుగును అందుకునేందుకు పదే పదే ప్రయత్నించింది.
ఆవు బొమ్మ నిజమైనదిగా కనిపించడంతో దూడ అలా స్పందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/CfqafRI8di
— Telugu Reporter (@TeluguReporter_) September 5, 2026