మహిళా రైతుపై భారీ కొండచిలువ దాడి!

జనగామ జిల్లా కంచనపల్లిలో మొక్కజొన్న చేనులో పని చేస్తున్న మహిళా రైతుపై భారీ కొండచిలువ దాడి చేసింది. గ్రామస్థులు రక్షించగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 06, 2026, 1:49 pm IST
Read Time: 3 mins
మహిళా రైతుపై భారీ కొండచిలువ దాడి!

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో స్వప్న అనే మహిళా రైతుపై భారీ కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. మొక్కజొన్న చేనులో పని చేస్తున్న స్వప్నపై సమీప పొదల్లో నుంచి వచ్చిన కొండచిలువ దాడి చేసి మింగేందుకు ప్రయత్నించింది. కొండ చిలువ దాడికి గురైన స్వప్న పెద్దగా అరువడంతో ఆమె అరుపులు విన్న సమీప రైతులు, కూలీలు వెంటనే స్పందించి కొండచిలువను కొట్టి దాని పట్టు నుంచి ఆమెను విడిపించి ప్రాణాలు కాపాడారు.

ఆ తర్వతా ఎలాంటి కొండచిలువ కాటేసిందో తెలిస్తే వైద్యం సులభంగా ఉంటుందనే ఆలోచనతో కొండచిలువను గోనె సంచిలో బంధించి, బాధితురాలితో సహా జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొండ చిలువ దాడిలో గాయపడిన స్వప్న ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఈ సందర్బంగా గ్రామస్తులకు వైద్యుడు బిక్షపతి కొండచిలువ దాడులపై అవగాహన కల్పించారు. కొండచిలువ పాములో ఎలాంటి విషము ఉండదు కానీ.. మనిషిని అయినా పశువునైన మింగేయగలదని, వీటి నుండి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ బిక్షపతి అవగాహన కల్పించారు.