తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ బులియన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని ప్రభావంతో పసిడి ధరలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 220 తగ్గి రూ.1,44,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,32,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,35,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Aug 04, 2026, 12:36 pm IST
Read Time: 3 mins
తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ బులియన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని ప్రభావంతో పసిడి ధరలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో బంగారం ధరల్లో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. ఈ వారం పసిడి మార్కెట్ పెరగడమే కాని తగ్గడం జరగలేదు. అయితే నిన్న కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరట లభించగా ఈ రోజు కూడా పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

దీంతో సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ 220 తగ్గి రూ.1,44,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,32,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,35,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

ప్రస్తుత ధరల వద్ద కొనుగోలు చేయవచ్చా.. ?

రానున్న రోజుల్లో అంతర్జాతీయ ఉద్రిక్తతలతో పాటు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, అమెరికా డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణం పరిణామాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ అంశాలు అనుకూలంగా ఉంటే బంగారం తన ఎగబాకే ధోరణిని కొనసాగించే అవకాశం ఉందని.. లేకపోతే లాభాల స్వీకరణతో స్వల్ప ఒత్తిడి కనిపించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ధరలు కొనుగోలుదారులు సానుకూలంగా భావించవచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.