కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు కోసం చేసిన అప్పులు, నిర్మాణ పనులలో అవినీతి, కమిషన్ల ఆరోపణలు, కూలిన మేడిగడ్డ బ్యారేజీ సందర్శన, నీళ్ల పంపింగ్, ఆయకట్టు ప్రయోజనాలు, కరెంటు బిల్లులు వంటి అంశాలపై ఆయా పార్టీల మధ్య విమర్శల దాడులు సాధారణంగా మారిపోయాయి. ఎవరి వాదనను వారు సమర్థించుకుంటూ ప్రాజెక్టు సందర్శన తో, ఎన్డీఎస్ఏ నివేదిక, కమిషన్ విచారణ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మీడియా సమావేశాలు, సోసల్ మీడియా ప్లాట్ ఫామ్ లతో , బహిరంగ సభా వేదికలపైన, అసెంబ్లీ వేదికగా ఇప్పటిదాక చర్చోపర్చలు కొనసాగించారు.
అయితే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అనుకూల, వ్యతిరేక వాదనాలకు ఇప్పుడు ఏకంగా వ్యవసాయ క్షేత్రాలే వేదికలుగా మారిపోయాయి. నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓ యువకుడు కాంగ్రెస్ వాదనను సమర్థిస్తూ తన పొలంలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం చేసి కాళేశ్వరం ఓ విఫల ప్రాజెక్టు అని..ఎల్లంపల్లి హిట్..మేడిగడ్డ ఫట్ అంటూ ఓ వీడియో చేశాడు. ఇది కాస్తా వైరల్ అయ్యింది.
కౌంటర్ ఎటాక్..
దానికి కౌంటర్ గా కాళేశ్వరం ప్రాజెక్టుకు మద్దతుగా బీఆర్ఎస్ వాదనను సమర్ధిస్తూ మరో వ్యక్తి పొలంలో కాళేశ్వరం, శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం డిజైన్లను నిర్మించి ఓ వీడియో రిలీజ్ చేశారు. కేసీఆర్ దార్శనికతతోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వెలుతున్నాయని, తుమ్మిడి హట్టి వద్ద కంటే మేడిగడ్డ వద్దనే నీటి లభ్యత అధికం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గేమ్ ఛేంజర్ అని చెప్పే ప్రయత్నం చేశాడు. 2010లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు కనెక్టివిటీనే లేదు. ఆ లోటును తీర్చి, లింక్ నిర్మించి, భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోసే వ్యవస్థను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని వివరించాడు.
ఇలా కాళేశ్వరం అనుకూల, వ్యతిరేక వాదనలు పొలాల మీదుగా సోషల్ మీడియాలోకి వ్యాప్తి చెంది హాట్ టాపిక్ గా మారడం ఈ ప్రాజెక్టుపై చర్చోపచర్యలను మరింత ఆసక్తికరంగా మార్చేసింది.
కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 18–20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యం కాదు.
2010లో ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు కనెక్టివిటీనే లేదు. ఆ లోటును తీర్చి, లింక్ నిర్మించి, భారీ మోటార్లతో నీటిని ఎత్తిపోసే వ్యవస్థను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే.… pic.twitter.com/fNlsUEEWzb
— RG TV TELANGANA (@RGTVHD9949) August 3, 2026