చిక్కిన పెద్ద చేపలు..మత్స్యకారులలో ఆనందం!

కాళేశ్వరం ప్రాజెక్టు వరద కాలువలో భారీ సైజు చేపలు చిక్కడంతో కరీంనగర్ జిల్లా మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. 20 నుంచి 35 కిలోల బరువున్న చేపలు ఒక్కోటి రూ.3 వేల వరకు విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 14, 2026, 1:39 pm IST
Read Time: 2 mins
చిక్కిన పెద్ద చేపలు..మత్స్యకారులలో ఆనందం!

భారీ వర్షాలు, వరదలతో రిజర్వాయర్లు, చెరువులకు జలకళతో పాటు మత్స్యకారులకు భారీ చేపల లభిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని గాయత్రి పంప్ హౌస్ ఎత్తిపోతలతో కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ శివారులోని వరద కాలువలో నీటి ప్రవాహం కొనసాగింది. తాజాగా నీటి విడుదల నిలిపివేయడంతో మత్స్యకారులు రెండ్రోజులుగా చేపలు పడుతున్నారు. గుండన్నపల్లి వద్ద కాలువలో మత్స్యకారుల వలలకు భారీ సైజు బొచ్చ, రవ్వ చేపలు చిక్కడంతో వారి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

ఒక్కో చేపకు 20కిలల నుంచి 35కిలోల వరకు ఉన్న పెద్ద చేపలు వారి వలలకు చిక్కాయి. వాటిని మార్కెట్ లో ఒక్కోటి రూ. 3వేలకు విక్రయించడంతో మంచి లాభం వచ్చిందని మత్స్యకారుడు సంపత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల మానేరు జలాశయంలోనూ భారీ సైజు చేపలు మత్స్యకారులకు చిక్కడం తెలిసిందే.