• Telugu News
  • /Trending

కుక్కలతో కలిసి పిల్లల క్రికెట్..వైరల్ వీడియో

పల్లెటూరిలో పిల్లలు పెంపుడు కుక్కలతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో వైరల్ అవుతోంది. కుక్కలు కీపింగ్, ఫీల్డింగ్ చేస్తూ బంతిని క్యాచ్ పట్టడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Aug 06, 2026, 2:50 pm IST
Read Time: 2 mins
కుక్కలతో కలిసి పిల్లల క్రికెట్..వైరల్ వీడియో

పిల్లలు తమ పెంపుడు కుక్కలతో కలిసి క్రికెట్ ను ఆడతుండగా..ఆటలో కుక్కలు కీపింగ్, ఫిల్డింగ్ చేస్తూ మనుషుల మాదిరిగా బంతిని నోటితో క్యాచ్ పట్టడం వినడానికే వింతగా ఉన్న ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పచ్చని పర్వత ప్రాంతంలోని ఓ పల్లెటూరి మట్టి పిచ్‌పై, చిన్న పిల్లలు కర్రలను స్టంప్స్‌గా వాడుతూ క్రికెట్ ఆడుతున్నారు.

అదే సమయంలో కుక్కలు బౌలర్ వేసిన బంతిని వికెట్ల వెనుక కీపింగ్ చేయడం, బ్యాటర్ కొట్టిన బంతిని పరుగున వెళ్లి నోటితో పట్టుకోవడం, క్యాచ్ గా పట్టుకుని అవుట్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. కుక్కలతో కలిసి పిల్లలు క్రికెట్ ఆడుతున్న మైదానంలోనో ఓ పక్కన పశువులు మేత మేస్తున్నాయి.

ఇలా పశువులు, ఆటగాళ్లుగా మారిన కుక్కల మధ్య బ్యాటింగ్, ఫిల్డింగ్ చేస్తూ పరుగెడుతున్న పిల్లలతో కనువిందు చేస్తున్న ఈ పల్లెటూరి వీడియో దృశ్యాన్ని చూసిన నెటిజన్లు పచ్చని ప్రకృతి మధ్య జంతువులతో కలిసి ఆడటం ఎంత ఆహ్లాదకరంగా ఉందోనంటూ కామెంట్లు పెడుతున్నారు.