• Telugu News
  • /Sports

షాకింగ్ వీడియో.. ఫుట్ బాల్ ఆటగాడిపై పిడుగు!

థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిపై పిడుగు పడింది. సోఫ్వాన్ అవేయ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఘటన వీడియో వైరల్‌గా మారింది.

Reported by: Tejaswini Nanna | క్రీడలు | Aug 06, 2026, 1:58 pm IST
Read Time: 5 mins
షాకింగ్ వీడియో.. ఫుట్ బాల్ ఆటగాడిపై పిడుగు!

మైదానంలో ఫుట్ బాల్ ఆడుతున్న ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగు పడిన ఘటన సంచలనం రేపింది. పిడుగపాటులో ఓ ఆటగాడు చనిపోగా..మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ గా మారింది.

థాయ్‌లాండ్‌లో గోలక్ కప్ టోర్నీలో భాగంగా నరాతివాత్ ప్రావిన్స్‌లోని శాంటిప్ హాప్ స్టేడియంలో మ్యాచ్ కొనసాగుతుంంది. అదే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడి ఆగిపోవడంతో ఆట కొనసాగుతున్న క్రమంలో హఠాత్తుగా పిడుడు పడింది. మైదానంలో ఆడుతున్న సోఫన్ అవేయ్ (24)పై ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటుకు అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిడుగు పడిన వెంటనే మంటలు చెలరేగడం, ఆటగాడు కుప్పకూలిపోవడం వీడియోలో కనిపిస్తోంది.

పిడుగు పాటుకు గాయ‌ప‌డ్డ‌వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 12 మంది ఆటగాళ్లలో ఒక మలేషియా క్రీడాకారుడు కూడా ఉన్నాడని, ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీస్ చీఫ్ థున్ సిరిఖుంట్ తెలిపారు. మరణించిన వింగర్ సొఫ్వాన్ అవాయే ఇటీవలే థాయ్ థర్డ్- టియర్ క్లబ్ అయిన ‘యాలా ఎఫ్సీ’కి సైన్ చేశాడు. అతని హఠాన్మరణం పట్ల యాలా ఎఫ్సీ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, అతని కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటించింది. వ‌ర్షం ఆగిపోవ‌డంతో మ్యాచ్ నిర్వ‌హించామ‌ని, ఇలా హ‌ఠాత్తుగా పిడుగు మైదానంలో ప‌డుతుంద‌ని ఊహించ‌లేక‌పోయామ‌ని, ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సోఫ్వాన్‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని గోలోక్ క్ల‌బ్ నిర్వాహ‌కులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

థాయ్‌లాండ్‌లో పిడుగుపాటు మరణాలు గణనీయ స్థాయిలో నమోదవుతున్నాయి. . డిసీజ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారం.. 2020 నుండి 2024 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 283 మంది పిడుగుపాటుకు గురయ్యారు. వారిలో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది మే నెలలోనే లంపాంగ్, ఉథాయ్ థానీ ప్రావిన్సులలో వేర్వేరు ఘటనల్లో పిడుగుపడి గర్భిణి సహా ముగ్గురు మరణించినట్లుగా నివేదిక పేర్కొంది.