ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా నర్హర్‌పూర్ అటవీ పరిధిలో ఉన్న లర్‌గావ్-మర్కటోలా ప్రాంతంలో ఎలుగుబంటిదాడిలో అన్నా చెల్లెళ్లు మృతి చెందిన ఘటన విషాదం రేపింది. గోర్సే జూరి (50), సోదరుడు హలాల్ జూరి (45) తమ పిల్లలతో కలిసి తన ఎద్దులను మేపేందుకు పొలానికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో వారిపై అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. పిల్లలను సురక్షిత ప్రాంతాల్లో వదిలేసి.. గోర్సే, హలాల్ ఇద్దరు కలిసి ఆ ఎలుగుబంటితో తలపడ్డారు.
వారి కేకలు విని.. సమీపంలోని పొలంలో పని చేస్తున్న మరో సోదరి ఖోరిన్ బాయి(43) వారిని రక్షించేందుకు వచ్చింది. అయితే.. ఎలుగుబంటి దాడిలో గోర్సే, హలాల్ మృతి చెందగా. ఖోరిన్‌కి తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎలుగుబంటి పిల్ల ఒకటి అంతకు ముందు రోజు చనిపోయింది. ఆ పిల్ల మృతదేహం పక్కనే తల్లి ఎలుగుబంటి రాత్రంతా కాపలా కాసింది. ఆ తర్వాత అటవీ శాఖ సిబ్బంది పిల్ల మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీంతో మరింత ఆందోళనకు గురైన ఆడ ఎలుగుబంటి తీవ్ర ఆగ్రహంతో గ్రామస్తులపై దాడి చేసిందని తెలుస్తుంది.
ఎలుగుబంటి తను చంపిన మనుషుల మృతదేహాల వద్దే కూర్చొని వాటిని వదిలిపెట్టకుండా ఉండటంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు అతికష్టం మీ అటవీ అధికారులు మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. ఎలుగుబంటిపై ఆగ్రహంలో ఉన్న గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు ఎదురుతిరిగి..దానిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపేశారు. అనంతరం అధికారులు ఎలుగుబంటిని, మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు.ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది.
A bear attacked and killed two brothers while working on a farm.
Authorities say the bear was not taking the grief well after one of her cubs recently died from natural causes. pic.twitter.com/Uegp9BqReY
— Malume (@bozzie_t) August 7, 2026