Belly Man | సిక్స్ ప్యాక్ కాదు.. బొర్ర ఉంటేనే సుందరాంగులు.. అక్కడ పొట్ట ఉన్న అబ్బాయిల వెంటే అమ్మాయిలు క్యూ కట్టేస్తారు!

Belly Man | ఫిట్‌గా ఉండి సిక్స్ ప్యాక్ ఉంటేనే అమ్మాయిలు చూస్తారని కుర్రాళ్లంతా అనుకుంటారు. కానీ బొర్ర ఉన్నవాడే మగాడు.. సుందరాంగుడు అని అనుకునే ఓ ప్లేస్ ఉందని తెలుసా! ఇథియోపియో(Ethiopia)లోని అడవుల్లో ఉన్న బోడీ తెగవాళ్లు(Bodi Tribe).. ఎంత పెద్ద పొట్ట ఉంటేనే అతడిని అంత హ్యాండ్‌సమ్‌గా చూస్తారంట.

Belly Man | సిక్స్ ప్యాక్ కాదు.. బొర్ర ఉంటేనే సుందరాంగులు.. అక్కడ పొట్ట ఉన్న అబ్బాయిల వెంటే అమ్మాయిలు క్యూ కట్టేస్తారు!

Belly Man | ఫిట్‌గా ఉండి సిక్స్ ప్యాక్ ఉంటేనే అమ్మాయిలు చూస్తారని కుర్రాళ్లంతా అనుకుంటారు! అందుకే అమ్మాయిల ముందు తమ పొట్టను దాచేస్తుంటారు.. జిమ్‌లకు వెళ్లి కసరత్తులు చేసి బొర్ర తగ్గించేస్తుంటారు. కానీ బొర్ర ఉన్నవాడే మగాడు.. సుందరాంగుడు అని అనుకునే ఓ ప్లేస్ ఉందని తెలుసా! ఇథియోపియో(Ethiopia)లోని అడవుల్లో ఉన్న బోడీ తెగవాళ్లు(Bodi Tribe).. ఎంత పెద్ద పొట్ట ఉంటేనే అతడిని అంత హ్యాండ్‌సమ్‌గా చూస్తారంట.. అలాంటి వ్యక్తులను అమ్మాయిలు పోటీపడి మరీ ప్రేమిస్తారట.

ఆఫ్రికా దేశమైన ఇథియోపియోలోని ఓమో లోయలో నివసించే బోడీ తెగ ఆచారం ప్రకారం.. బొద్దుగా, ముందుకు పొడుచుకు వచ్చే పొట్టలతో ఉన్న వారిని శక్తివంతులుగా చూస్తారు. అంతేకాదు పెద్ద పొట్ట ఉన్న వాళ్ల కోసం ప్రత్యేకంగా పోటీలు కూడా పెడతారు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే కాయల్ ఉత్సవం(Kael Cermeony)లో భాగంగా ఈ పొట్ట పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు.. యువకులు కష్టపడి తమ పొట్టలను పెంచుతుంటారు.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆరు నెలల ముందు నుంచే కఠోర శ్రమను మొదలుపెడతారు. ఆరు నెలల ముందు నుంచి అన్ని పనులు మానేసి ఇంటికే పరిమితమైపోతారు. అప్పట్నుంచి అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని అధిక మొత్తంలో తీసుకుంటుంటారు. బరువు పెరిగేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన పానీయాలను రోజూ తీసుకుంటారు. శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుందని ముఖ్యంగా ఆవు పాలు, రక్తం కలిపి మిశ్రమాన్ని ఎక్కువగా సేవిస్తారు. అలా మొత్తానికి తమ పొట్ట బెలూన్ల ఉబ్బిపోయేందుకు ఎంత తినాలో అంత తినేసి.. కాయల్ ఉత్సవానికి రెడీ అవుతుంటారు. ఇలా పొట్ట పెంచేందుకు అబ్బాయిలు కష్టపడుతుంటే.. పొట్టతో ఉన్న అందగాళ్లను చూడాలని అమ్మాయిలు కూడా ఏడాదంతా ఎదురుచూస్తారు.

ఇక కాయల్ ఉత్సవం రోజున యువకులు తమ శరీరానికి బూడిద, మట్టి పూసుకుని సాంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తారు. అనంతరం వరుసగా నిల్చుంటే.. తెగ పెద్దలు వచ్చి వారి పొట్ట పరిమాణాలను కొలుస్తారు. ఎవరికి పెద్ద పొట్ట ఉంటే వారిని విజేతగా ప్రకటిస్తారు. టైటిల్ గెలిచిన వ్యక్తికి తెగలో అత్యున్నత గౌరవం లభిస్తుంది. అతడిని ఆ తెగకే మొగాడు.. మొనగాడిలా చూస్తారు. ఇక తెగలోని అందమైన అమ్మాయిలు సైతం ఆ సుందరాంగుడినే పెళ్లి చేసుకోవాలని క్యూ కడతారు.

ఈ సంప్రదాయం బోడీ తెగలో వందల ఏళ్లుగా కొనసాగుతుంది. ఇక్కడ అందానికి ప్రత్యేక నిర్వచనం ఉంది. పురుషులకు బాణ పొట్ట అందం అయితే.. అమ్మాయిలకు శరీరంపై గాట్లు, గాయాల గుర్తులను అందానికి ప్రతీకగా చూస్తారు.

Read More:

AI Data Centers | డాటా సెంటర్లు ‘హీట్‌ ఐలాండ్స్‌’గా మారిపోతున్నాయా? మానవాళికి కొత్త అధ్యయనం హెచ్చరికలు

Vermicompost Business | వ‌ర్మీకంపోస్టు త‌యారీ.. రూ. 20 వేల పెట్టుబ‌డితో ఏడాదికి రూ. 2 కోట్ల ట‌ర్నోవ‌ర్