Viral Video | వైరల్ అవ్వాలని రీల్.. యువతికి కోతి ఇచ్చిన షాక్ చూడండి!
viral video | వైరల్ అవ్వాలని రీల్ చేస్తుండగా ఓ యువతికి కోతి ఊహించని షాకిచ్చింది. కెమెరా ముందు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా ఆమెపైకి దూసుకొచ్చింది. అది చూసి భయంతో ఒక్కసారిగా ఆమె ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video | సోషల్‌మీడియా ప్రభావంతో చాలామంది యువతీయువకులు చదువు కంటే కూడా రీల్స్, వైరల్ వీడియోలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వైరల్ కావాలనే ఉద్దేశంతో విచిత్రమైన స్టంట్లు, వీడియోలు చేస్తున్నారు. ఇలా చేసి కొందరు ఫేమస్ అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అవి బెడిసి కొడుతుంటాయి. అవి కాస్త సోషల్‌మీడియాలో నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి తన ఇంటి ముందు ఉన్న చిన్న సందులో రీల్ చేయడానికి తన మొబైల్ కెమెరాను సెట్ చేసుకుంది. తర్వాత కెమెరా ముందు నిలబడి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె వివిధ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిందో లేదో.. అంతలోనే అక్కడ ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
యువతి డ్యాన్స్ చేస్తుండగా కొద్ది దూరంలో నుంచి ఓ కోతి ఆమెవైపునకు దూసుకొచ్చింది. ఇది గమనించి భయపడిపోయిన యువతి వెంటనే అప్రమత్తమైపోయి ఇంట్లోకి పరిగెత్తింది. అయితే మొబైల్ ఫోన్ బయటే మరిచిపోయానని గుర్తొచ్చిన యువతి.. కోతి తీసుకెళ్లిపోతుందేమోనన్న భయంతో తిరిగొచ్చింది. వెంటనే ఫోన్ తీసుకుని లోపలికి వెళ్లిపోయింది. అలా వినూత్నంగా రీల్ చేయాలని ప్రయత్నించిన యువతికి ఆ కోతి ఊహించని షాకిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
दीदी खुद को वायरल करना चाहती थी लेकिन दीदी के साथ तो कांड हो गया pic.twitter.com/09WWw2BUpR
— Rupali Gautam (@Rupali_Gautam19) March 11, 2026
ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏదో చేయాలని చూస్తే.. చివరికి ఇంకేదో అయ్యిందే అంటూ కొందరు కామెంట్ చేశారు. ఈ కోతి భలే షాకిచ్చిందిగా అంటూ మరికొందరు.. వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ వీడియో 220కి పైగా లైక్‌లు, 61 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Read More:
iPhone Fold | యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. రిలీజ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్లు లీక్!
10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ SUV.. 2026 కియా సోనెట్ కొత్త వేరియంట్లు వచ్చేశాయి!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram