iPhone Fold | యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. రిలీజ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్లు లీక్!

iPhone Fold | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ యాపిల్.. త్వరలోనే తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకురాబోతుంది. యాపిల్ కంపెన్నీ దీన్ని అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ.. వచ్చే సెప్టెంబర్‌లో ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

iPhone Fold | యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. రిలీజ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్లు లీక్!

iPhone Fold | ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ యాపిల్ త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది! ఐఫోన్ ఫోల్డ్ పేరుతో మొట్ట మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకురాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా మల్టీటాస్కింగ్‌కు అనువైన కొత్త ఐవోఎస్ ఉండబోతుందని సమాచారం. దీనిని యాపిల్ కంపెనీ అధికారికంగా ఇప్పటివరకు ధృవీకరించలేదు. కానీ దీన్ని వచ్చే సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం.. ఇది మూసి ఉన్నప్పుడు ఐఫోన్‌లా.. తెరిచినప్పుడు ఐప్యాడ్ తరహా లేఅవుట్, సైడ్‌బార్ ఇంటర్‌ఫేస్ కనిపించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఇన్నర్ డిస్‌ప్లే పరిమాణం దాదాపు ఐపాడ్ మినీ స్క్రీన్‌కు సమానంగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే బయట భాగంలో ఐఫోన్ మినీ సైజ్‌లో మరో డిస‌ప్లే ఉండబోతుంది. ఫోన్‌ను తెరిచినప్పుడు విస్తృతమైన ఆస్పెక్ట్ రేషియోతో పెద్ద స్క్రీన్ కనిపించడంతో వీడియోలు చూడటానికి, మల్టీ టాస్కింగ్ చేయడం సులభమవుతుందని అంటున్నారు.

మల్టీ టాస్కింగ్‌కు అనుగుణంగా ఈ పోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇందుకోసం ఐవోఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేకంగా మార్పులు చేయనున్నారు. అయితే ఐప్యాడ్ ఓఎస్ కాకుండా ఐవోఎస్‌తోనే మార్పులు చేస్తున్నందున ఐపాడ్‌లో ఉండే పూర్తి డెస్క్‌టాప్ తరహా మల్టీ టాస్కింగ్‌ ఇందులో ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లలో క్రీస్ సమస్య ఉంది. అంటే స్క్రీన్‌ను తెరిచినప్పుడు రెండు స్క్రీన్ల డిస్‌ప్లే మధ్య మడత ఒక గీతలా ఉంటుంది. దీనివల్ల స్క్రీన్ కాస్త డిస్ట్రబెన్స్‌గా అనిపిస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించి, క్రీజ్ పూర్తిగా తగ్గించేలా ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే డ్యురబిలిటీ సమస్యపైనా యాపిల్ కంపెనీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఎన్నిసార్లు ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా స్క్రీన్ త్వరగా దెబ్బతినకుండా ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌లో ఫేస్ ఐడీ ఫీచర్‌ను తొలగించి, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను సైడ్ బటన్‌లో అమర్చే అవకాశం ఉందని నిపుణులుచెబుతున్నారు. ఐఫోన్‌ ఫోల్డ్‌లో ఫ్రంట్ ప్యానల్ చాలా పలుచగా ఉండటం వల్ల ఫేస్ ఐడీ సెన్సర్ అమర్చడం కష్టమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ధరను సుమారు 2వేల అమెరికన్ డాలర్లుగా నిర్ణయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం శాంసంగ్ కంపెనీ 128జీబీ ర్యామ్ మాడ్యుళ్లను సరఫరా చేసే అవకాశం ఉందని ది బెల్ నివేదిక వెల్లడంచింది.

ఇక ఫోల్డబుల్ ఐఫోన్ మార్కెట్‌లోకి వస్తే శాంసంగ్, ఒప్పో, వన్ ప్లస్ తరహా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ తప్పదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Read More:

OPPO Find N6 | ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!