OPPO Find N6 | ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!

OPPO Find N6 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతుంది. OPPO Find N6 మొబైల్‌ను మార్చి 17వ తేదీన చైనాలో ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

OPPO Find N6 | ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!

OPPO Find N6 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాబోతుంది. OPPO Find N6 మొబైల్‌ను మార్చి 17వ తేదీన చైనాలో ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వస్తున్న లీకులకు అనుగుణంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఫోన్ డిజైన్‌, కలర్ ఆప్షన్లతో పాటు కొత్త టెక్నాలజీ వివరాలను వెల్లడించింది.

సాధారణంగా ఫోల్డబుల్ ఫోన్లలో ఎక్కువగా వినిపించే సమస్య స్క్రీన్ దగ్గర కనిపించే ముడత ( crease ). ఈ సమస్యను తగ్గించేందుకు జీరో ఫీల్ క్రీజ్ అనే కొత్త ఫీచర్‌ను ఒప్పో వినియోగించింది. ఇందులో టైటానియం అలాయి హింజ్‌తో పాటు మెమొరీ గ్లాస్ లేయర్‌ను వినియోగించింది. వీటి కారణంగా స్క్రీన్ మలిచినప్పుడు, తెరిచినప్పుడు స్క్రీన్ సమంగా పంచబడుతుంది. దీనివల్ల రెండు స్క్రీన్‌ల మధ్యలో కనిపించే ముడత, గీత గుర్తులు పూర్తిగా తగ్గిపోతాయి. దీంతో ఫోల్డబుల్ ఫోన్‌ను ఏళ్లతరబడి వినియోగించినా కూడా స్క్రీన్ ప్లాట్, సెన్సెటివ్ ఫీల్‌న అందిస్తుంది.

ఒప్పో ఫైండ్ ఎన్6 మొబైల్ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. గోల్డెన్ ఆరెంజ్, ఒరిజినల్ టైటానియం, డీప్ బ్లాక్ కలర్లలో అందుబాటులోకి రానుంది. ఇక ఇది మూడు స్టోరేజి వేరియంట్లలో వస్తుందని సమాచారం. 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజి, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్  + 1 టీబీ స్టోరేజితో వస్తుందని తెలుస్తోంది. టాప్ వేరియంట్‌లో శాటిలైట్ కనెక్టివిటీ సపోర్టు ఉందని సమాచారం.

లీకైన స్పెసిఫికేషన్లు!

అధికారికంగా ఒప్పో కంపెనీ ప్రకటించకపోయినప్పటికీ ఇందులో అత్యంత శక్తివంతమైన స్పెసిఫికేషన్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  • 8.12 అంగుళాల ఇంటర్నల్ ఫోల్డబుల్ డిస్‌ప్లే
  • 6.62 అంగుళాల కవర్ స్క్రీన్
  • స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్
  • 6000 mAh బ్యాటరీ
  • ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు

ఇక కెమెరా విషయానికొస్తే 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో వస్తుంది.

ఓపెన్ పెన్ స్టైలస్

ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో OPPO AI Stylus కూడా సపోర్టు చేస్తుంది. దీంతో ఏఐ సాయంతో నోట్స్ రాయడం, స్కెచ్ వేయడం, డిజైన్ పనులు చేయడానికి సహాయపడుతుంది. అలాగే మల్టీ టాస్కింగ్ సహా ఇతర పనులకు ఉపయోగపడుతాయి.

భారత్‌లోకి ఎప్పుడు వస్తుంది

OPPO Find N6 ప్రస్తుతం చైనా మార్కెట్‌కు పరిమితమైంది. ఇది భారత్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇంకా స్పష్టత రాలేదు.

Read More:

వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ