Robot Walking | రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

Robot Walking | చైనాలో వింత ఘటన కనిపించింది. రోబో కుక్కను తీసుకుని హ్యుమనాయిడ్ రోబో పార్కులో వాకింగ్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సో‌షల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | Mar 10, 2026, 10:06 pm IST
Read Time: 3 mins
Robot Walking | రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

Robot Walking | హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సన్నివేశాల్లో కనిపించే సన్నివేశం ఇప్పుడు నిజజీవితంలోనూ కనిపించింది. చైనాలో ఒక హ్యుమనాయిడ్ రోబో తనతో పాటు ఒక రోబో కుక్కను తీసుకుని వాకింగ్‌కు వెళ్లింది. రోడ్లపై ఇది చూసిన జనాలు నోరెళ్లబెట్టారు. ఆ వింత దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారు. అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో చైనాకు చెందిన రోబొటిక్స్ సంస్థ యునిట్రీ రోబోటిక్స్ రూపొందించిన హ్యుమనాయిడ్ రోబో ఒక పార్క్‌లో వాకింగ్ చేస్తూ కనిపించింది. దానిపక్కనే యునిట్రీ గో2 రోబో డాగ్ లీష్ కూడా వాకింగ్ చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంంటే.. రోబో కుక్క మెడకు ఒక తాడు ఉండగా.. దాన్ని రోబో మనిషి పట్టుకుని వాకింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నది. ఇది చూసిన పలువురు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో రెడిట్‌లో పోస్టు అయ్యింది. కేవలం 23 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో కొద్దిగంటల్లోనే లక్షల వ్యూస్ సంపాదించి, సోషల్‌మీడియాలో చర్చకు దారితీసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Rising Startup (@risingstartup)

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రోబో కుక్కకు రోబో యజమాని కూడా వచ్చేశాడు. ఇది చాలా ఫన్నీగా ఉందని ఒకరు కామెంట్ చేయగా.. ప్రపంచ చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన డాగ్ వాకింగ్. ఎందుకంటే ఆ రోబో మనిషి ధర 16వేల డాలర్లు ఉంటుంది.. కుక్క ధర 2800 డాలర్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వీడియో చూస్తూ స్కై ఫై సినిమా చూసినట్లు మరొకరు కామెంట్ చేశారు. ఇక రోబోలు మనల్ని పాలించబోతున్నాయంటూ మరొకరు స్పందించారు.

Read More:

వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ