IRCTC | వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ

IRCTC | వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఐఆర్‌సీటీసీ కాఫీ విత్ కర్ణాటక పేరుతో స్పెషల్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. మే 3వ తేదీ హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లి మైసూర్, కూర్గ్‌ అందాలను చూసి వచ్చేలా టూర్ ప్లాన్ చేసింది.

IRCTC | వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్‌సీటీసీ కాఫీ విత్ కర్ణాటక పేరుతో ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజిని ప్రకటించింది. ఇందులో భాగంగా మైసూర్, కూర్గ్ ప్రాంతాల సందర్శన ఉంటుంది.

IRCTC | సమ్మర్ హాలీ డేస్ సమీపిస్తుండటంతో చాలామంది టూర్‌లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజి ( Tour Pakage)ని తీసుకొచ్చింది. ఈ వేసవికాలంలో కర్ణాటకలోని మైసూర్ (Mysore) రాజభవనాలతో పాటు కూర్గ్ (Coorg )పచ్చటి ప్రకృతి అందాలను, రమణీయమైన జలపాతాలను వీక్షించేందుకు మంచి అవకాశం కల్పించింది. ‘కాఫీ విత్ కర్ణాటక’ ( Koffee with Karnataka )పేరుతో తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ ప్రకారం మే 3వ తేదీన టూర్ ప్రారంభం కానుంది.

ఈ ఏడాది మే 3వ తేదీన హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభమై.. తిరిగి మే 8వ తేదీన హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో మైసూర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందు కూర్గ్‌కు తీసుకెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయం, తలకావేరి, భాగమండల, రాజా సీట్ పార్క్, కావేరి నిసర్గధామ, టిబెటన్ మానెస్టరీ, బృందావనం గార్డెన్స్, చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ వంటి చూడవచ్చు. మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటన అనంతరం కాచిగూడ రైల్వే‌స్టేషన్‌లో మే 8వ తేదీన దించుతారు.

ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ పెద్దలకు ఒక్కొక్కరికి రూ.46,550 చార్జి చేస్తుంది. అదే డబుల్ షేరింగ్ అయితే రూ.36,300, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.34,750 వసూలు చేయనున్నారు. పిల్లలకు వేర్వేరు ధరలను నిర్ణయించారు. ప్రస్తుతం ఈ టూర్‌కు కేవలం 19 మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్యాకేజికి సంబంధించి పూర్తివివరాలను ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇక్కడే టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 8287932229/8287932228/9701360701 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

షెడ్యూల్ ఇదీ

మొదటి రోజు : మే 3వ తేదీన ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయల్దేరుతుంది. మధ్యాహ్నానికి మైసూర్ విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న కూర్గ్‌కు వెళ్లి.. హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సాయంత్రం రాజా సీట్ పార్క్‌ను సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

రెండో రోజు : హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని తలకావేరి, భాగమండల ఆలయాలను చూసుకుంటారు. మళ్లీ రాత్రికి కూర్గ్ చేరుకుని హోటల్‌లో స చేస్తారు.

మూడో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని చెక్ అవుట్ చేసి బయల్దేరతారు. దారిలో నిసర్గధామ, టిబెటన్ మఠాలను సందర్శించుకుంటారు. అనంతరం మైసూర్‌కు బయల్దేరతారు. అక్కడ మైసూ్ ప్యాలెస్ విజిట్ తర్వాత హోటల్‌లో బస చేస్తారు.

నాలుగో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని చాముండి హిల్స్ చూడటానికి వెళ్తారు. అక్కడి నుంచి తలకాడు, సోమనాథపురం ఆలయాలను దర్శనం చేసుకుని వచ్చి, హోటల్‌లో బస చేస్తారు.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్‌ నుంచి బయల్దేరి వెళ్లి శ్రీరంగపట్నం ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మెల్కొటె వెళ్లి, అక్కడ చెలువనారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత బృందావనం గార్డెన్ కూడా వీక్షిస్తారు. రాత్రికి మైసూర్‌లోనే బస చేస్తారు.

ఆరో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ చెక్‌అవుట్ చేసి బయల్దేరతారు. ముందుగా సుఖవనం చూసుకుని మైసూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యామ్నం 12.3 గంటలకు బయల్దేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీలో వచ్చేవి.

– హైదరాబాద్ నుంచి మైసూర్‌కు, మైసూర్ నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు
– కూర్గ్‌లో రెండు రాత్రులు, మైసూ‌ర్‌లో మూడు రాత్రుల బస
– ఐదు బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్‌లు
– టూర్ మధ్యలో ఏసీ బస్సు ప్రయాణం
– ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎస్కార్ట సర్వీస్

ప్యాకేజీలో రానివి

– టూర్ సమయంలో లంచ్, ఇతర ఫుడ్ సర్వీసులు
– ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు పికప్, ఎయిర్‌‌పోర్టు నుంచి ఇంటికి డ్రాప్
– విమానంలో తీసుకునే ఫుడ్
– పర్యటన సమయంలో ఆలయాలు, ప్యాలెస్, పార్కుల ప్రవేశ, దర్శన టికెట్లు
– ప్రయాణంలో డ్రైవర్లకు, గైడ్‌లకు ఇచ్చే టిప్‌లు
– బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ కాకుండా పర్యటన సమయంలో చేసే భోజనం, డ్రింకింగ్ వాటర్, మందు, లాండ్రీ వంటివి

Read More:

Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!

Floating Village | భారత్‌లోనే నీటిపై తేలియాడే ఏకైక గ్రామం..