ఏం తేల్చబోతున్నారు..?: కేసీఆర్ తో కేటీఆర్ భేటీ !
ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కేటీఆర్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ వ్యూహంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
విధాత : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవల్లిలోని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేటీఆర్ తాజా రాజకీయ పరిస్థితులు, రాజ్యసభ ఎన్నికల అంశాలపై కేసీఆర్ తో చర్చించనున్నట్లుగా సమాచారం. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాంపై కూడా చర్చించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దించాలా? వద్దా ? అన్న అంశంపై వారిద్దరు చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి గా ఉన్న ఆశావాహుల పేర్లను కేసీఆర్ తో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం. కేసీఆర్ తో భేటీ అనంతరం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
డియర్ బ్రదర్ వాస్తవాలు తెలుసుకో: కేటీఆర్ పై కవిత ఫైర్
Virosh | పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిక్ అపియరెన్స్.. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్–రష్మిక సందడి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram