తగ్గిన బంగారం, వెండి ధరలు

గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.1,43,120వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10తగ్గి రూ.1,31,190 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 100 తగ్గి రూ. 2,44,900వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jul 09, 2026, 12:00 pm IST
Read Time: 3 mins
తగ్గిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య యుద్ద ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో అంతర్జాతీయంగా ఇంధనం, బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.1,43,120వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10తగ్గి రూ.1,31,190 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 100 తగ్గి రూ. 2,44,900వద్ద కొనసాగుతుంది.

మరికొంత కాలం హెచ్చు తగ్గులు

పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరిపోవడంతో బంగారం, వెండి ధరలలో మరికొంత కాలం హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా డాలర్ విలువ, ఫెడరల్ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంలలో మార్పులు, పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరలలో అస్థిరతను కొనసాగిస్తాయని చెబుతున్నారు. కొనుగోలుదారులకు ప్రస్తుత ధరలు సానుకూలంగా భావించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

అయితే యుద్ద ఉద్రిక్తతలు సద్దుమణిగిన పక్షంలో దీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకోవచ్చంటున్నారు. దేశీయంగా బంగారం, వెండి దిగుమతుల సుంకాల పెంపు కొనసాగనున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలపై ప్రతికూల ప్రభావం కొనసాగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.