తెలంగాణకు ఏడు రోజులు వర్షాలు

ఎలినినో హెచ్చరికల క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణకు రాగల 7 రోజుల పాటు వర్ష సూచన చేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 09, 2026, 10:54 am IST
Read Time: 2 mins
తెలంగాణకు ఏడు రోజులు వర్షాలు

విధాత, హైదరాబాద్ : ఎలినినో హెచ్చరికల క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు, రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణకు రాగల 7 రోజుల పాటు వర్ష సూచన చేసింది. ఉత్తర తెలంగాణలో 60 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వరుస వర్షాల నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు, బలమైన గాలుల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దాదాపు ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం సాధారణంగా మబ్బు పట్టి ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.