ప్రియుడి నిర్వాకం..ఆగిపోయిన నిశ్చితార్థం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో జరిగే నిశ్చితార్థాన్ని ఆపేందుకు చేసిన వినూత్న చర్య వైరల్ గా మారింది. ఎలాగైనా ఆ పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ప్రియుడు.. తన ప్రియురాలితో కలిసి దిగిన ఫొటోలను, పెళ్లి కొడుకు ఫొటోలను కలిపి వాల్ పోస్టర్లుగా ముద్రించి వరుడి ఊరంతా అంటించడం కలకలం రేపింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 09, 2026, 12:32 pm IST
Read Time: 4 mins
ప్రియుడి నిర్వాకం..ఆగిపోయిన నిశ్చితార్థం

ఇటీవల కాలంలోయువతరం ప్రేమ వ్యవహారాలు..పెళ్లిళ్లు రకరకాల మలుపులతో కొనసాగుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలుస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు తను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో జరిగే నిశ్చితార్థాన్ని ఆపేందుకు చేసిన వినూత్న చర్య వైరల్ గా మారింది.

తంగళ్లపల్లికి చెందిన ఓ యువతికి, సిద్దిపేటకు చెందిన యువకుడితో ఏడేళ్ల ప్రేమ వ్యవహారం ఉంది. యువతి కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించలేదు. అమ్మాయి కుటుంబం తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో బలవంతంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది. పెళ్లి పనులతో పాటు నిశ్చితార్థం కూడా జరుగుతుండటంతో ప్రియుడు తీవ్ర మనస్తాపం చెందాడు.

ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ప్రియుడు.. తన ప్రియురాలితో కలిసి దిగిన ఫొటోలను, పెళ్లి కొడుకు ఫొటోలను కలిపి వాల్ పోస్టర్లుగా ముద్రించాడు. వరుడి పేరు, తండ్రి పేరు, ఫోన్ నెంబర్లతో సహా వివరాలను అర్ధరాత్రి పూట వరుడి గ్రామంలోని గోడలపై అతికించాడు.ఉదయాన్నే ఈ పోస్టర్లను చూసిన గ్రామస్థులు షాక్ అయ్యారు. ప్రియుడు కారులో వచ్చి పోస్టర్లు అతికిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి

ఎంగేజ్మెంట్ జరిగే సమయంలో ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు నిశ్చితార్ధం ప్రక్రియను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిద్ధిపేటలో సదరు యవకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం 16 తులాల బంగారం కోసమే తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడు ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడంటూ సదరు ప్రియుడు ఆరోపించాడు.