తగ్గిన బంగారం, వెండి ధరలు

సోమవారం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ.1,46,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,34,400 పలుకుతోంది. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ. 10,000 తగ్గి రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jul 06, 2026, 12:35 pm IST
Read Time: 4 mins
తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో మార్కెట్‌లో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్), డాలర్ కదలికలు, అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. హైదరాబాద్ నగరంలో సోమవారం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ.1,46,620 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.1,34,400 పలుకుతోంది. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ. 10,000 తగ్గి రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం..ఈ వారంలో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు సానుకూల ధోరణితో బలంగా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. గడిచిన నాలుగు వారాల పాటు నిరంతరాయంగా తగ్గుముఖం పట్టిన బులియన్ మార్కెట్.. గత వారంలో అద్భుతంగా పుంజుకుని భారీ లాభాలతో ముగిసింది. దాదాపు నెల రోజుల పతనం తర్వాత బంగారం ధరలు కోలుకోవడానికి అంతర్జాతీయంగా బలహీనపడిన యూఎస్ డాలర్, తగ్గుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాపేక్షంగా స్థిరంగా ఉన్న ముడి చమురు ధరలతో పాటు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన వ్యాఖ్యలు వడ్డీ రేట్ల అంచనాలు దోహదం చేశాయి. మార్కెట్ పునఃపరిశీలించేలా చేశాయి.

అలాగే చైనా, జపాన్, జర్మనీ, యూరోజోన్‌లకు సంబంధించిన తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వడ్డీ రేట్ల దిశను నిర్దేశించనున్నాయి. రాబోయే వారంలో బంగారం, వెండి ధరలను ఆయా అంశాలతో పాటు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కొత్త భౌగోళిక రాజకీయ పరిణామాలు, ప్రపంచ కేంద్ర బ్యాంకులు జరిపే కొనుగోళ్ల సరళి బులియన్ మార్కెట్ దిశను శాసించవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags: