విధాత : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని అయితే..కాళేశ్వరం రాష్ట్రానికి వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కన్నేపల్లి పంప్ హౌజ్ వద్ద వృధాగా పోతున్న గోదావరి జలాలను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కన్నేపల్లి పంప్ హౌజ్ వద్దకునేను రాకుండా ప్రభుత్వం పోలీసులతో ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుందని, వృధాగా వెలుతున్న గోదావరి నీళ్లను చూపించేందుకే మేము వచ్చాం అని, రాజకీయాల కోసం మేము ఇక్కడికి రాలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలక ఎడారి అని పాడుకున్నాం అని, ఉమ్మడి రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉండేవని..మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అలాంటి పరిస్థితి కనిపిస్తుందన్నారు. ఆంధ్రపదేశ్‌లో గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ నేను పుట్టినప్పటినుండి కడ్తూనే ఉన్నారని, అందుకు భిన్నంగా స్వరాష్ట్రంలో కేసీఆర్ ఒక యజ్ఞంలో నాలుగేళ్లలో కాళేశ్వరం కట్టి చూపించారని, నీళ్లు పారించారని గుర్తు చేశారు. మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికి ఆనాడు తుమ్మడి హట్టి పూర్తి చేయలేదు అని, ప్రాణహిత చేవెళ్ల అంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మీద కక్షతో రైతుకు శిక్ష వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కన్నేపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని, పంపులు ఆన్ చేస్తే వారంలో నీళ్లు నింపుకోవచ్చు అని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు నీళ్లు ఇస్తే కరెంటు, యూరియా, సన్నలకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని భయపడుతుందన్నారు. ఎన్డీఎస్ఏను, ఎన్డీఏను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పడావు పెట్టి, నీటి పంపింగ్ చేయకుండా నాటకాలు వేస్తుందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెడుతు..రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చెప్పే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్టు చేయకపోతే..ప్రభుత్వం స్పందించకపోతే 50నుంచి 60 వేల మంది రైతులతో వచ్చి మేమే పంప్ హౌజ్ లను ఆన్ చేసి రైతులకు నీళ్లు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వడం మీకు చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్ కు కాళేశ్వరం అప్పగిస్తే..అన్ని ప్రాజెక్టులు నింపి చూపిస్తాం అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. వాతావరణ శాఖ మూడు నెలల నుంచి ఎలినినో హెచ్చరికలు చేస్తున్నా సోయిలేకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కరువును ఎదుర్కొనే చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నాడని విమర్శించారు.
370 పిల్లర్లు ఉండే 3 బ్యారేజీల్లో రెండు పిల్లర్ల దగ్గర కుంగుబాటు జరిగిందని, సరిగ్గా ఎన్నికల ముందే జరిగింది కాబట్టి..కేసీఆర్‌ను బద్నాం చేయడానికి అందులో ఏదో కుట్ర ఉన్నట్లు మాకు అనుమానం ఉందని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. కేవలం రూ. 400 కోట్లతో కుంగిన ఆ బ్లాక్ మొత్తం కొత్తది కట్టొచ్చు.. అందుకు ఎల్ అండ్ టీ ముందుకు కూడా వచ్చింది.. కానీ 31 నెలలైనా కనీసం ఒక్క అడుగు ముందట పడటం లేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ కేవలం 16.4 టీఎంసీలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 141 టీఎంసీలు అని గుర్తు చేశారు. ఆంధ్రా బార్డర్ వరకు 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బృహత్తర ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు అని, వందేళ్ల వరకు తెలంగాణ కరువు పరిస్థితులను కాళేశ్వరం వినియోగంతో అధిగమించవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, మాలోత్ కవిత, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, బాల్క సుమన్, చల్లా ధర్మారెడ్డి, రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, జీవన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, నోముల భగత్, చిరుముర్తి లింగయ్య, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, వొడితల సతీష్ కుమార్, దాసరి మనోహర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ కంచెలు బద్దలు కొట్టి కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS బృందం🔥
వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కుల కాళేశ్వరం నీళ్ల సాక్షిగా రేవంత్ సర్కార్ కుట్రలను ఎండగడుతున్న కేటీఆర్
కేటీఆర్ గారి వెంట శాసనమండలి ప్రతిపక్ష నేత… pic.twitter.com/AHo8zuHUmq
— BRS Party (@BRSparty) July 5, 2026