విధాత : ఎలినినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాల వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో కురవడం లేదు. దీంతో తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలలో జలాశయాలకు వానకాలంలో సైతం వరదల తాకిడి కరువైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటిన తీరు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క జలాశయం దగ్గర కనీసం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కూడా నమోదు కావడం లేదు.కానీ ఇలాంటి కరవు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కులకుపైగా నీరు ప్రవహిస్తుండటం ఆలోచింప చేస్తుంది. బహుశా అదే మేడిగడ్డ ప్రత్యేకత అని,అందుకే కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బీడు భూములకు గోదావరి జలాలను సమర్థవంతంగా మళ్లించాలంటే మేడిగడ్డనే సరైన పంపింప్ ప్రాంతం అని కేసీఆర్ సరిగ్గా ఆలోచించనడానికి ప్రస్తుత కరువు పరిస్థితుల్లో మేడిగడ్డ వద్ద సాగుతున్న లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహామే నిలువెత్తు నిరద్శరనం అంటున్నారు.
కాళేశ్వరంలో ప్రవహిస్తున్న ప్రతి క్యూసెక్కును సద్వినియోగం చేస్తే తెలంగాణ రైతాంగానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేసి వీలైనంత మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఎత్తిపోతల మోటార్లను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. నీటిని వృథాగా కిందికి వదిలేయడంపై తెలంగాణ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ -మేడిగడ్డ బ్యారేజ్!
మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటింది.
తెలంగాణ ప్రజలారా ఆలోచించండి రాష్ట్రంలోని ఏ ఒక్క జలాశయం దగ్గర కనీసం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కూడా నమోదు కావడం లేదు.
కానీ ఇంతటి కరువు… pic.twitter.com/gqXqd9H0Gy— Hi Kollapur (@HiKollapur) July 5, 2026