పసిడి పరుగులు..స్థిరంగా వెండి ధరలు

సోమవారం బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.530 పెరిగి రూ.1,55,660 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,42,700 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,55,000 వద్ద స్థిరంగా నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Aug 17, 2026, 11:47 am IST
Read Time: 2 mins
పసిడి పరుగులు..స్థిరంగా వెండి ధరలు

అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితులు, ఆర్థిక పరిణామాల మధ్య బంగారం ధరలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ మారడం వల్ల ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తుండటం పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తుంది. అలాగే డాలర్ మారకం విలువలో కదలికలు, గ్లోబల్ మార్కెట్ల ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. వివాహాల సీజన్ ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి.

సోమవారం బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.530 పెరిగి రూ.1,55,660 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,42,700 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,55,000 వద్ద స్థిరంగా నిలిచింది. మునుముందు బంగారం, వెండి ధరలు మరింత పైకి వెలుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.