విధాత, హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలలో రెండు వేర్వేరు ప్రమాదాలలో 8 మంది మరణించారు.తెలంగాణ నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వీఫ్టు కారున వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బలంగా ఢీ కొట్టంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోగా, కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ప్రసాద్ భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు ఆయన స్నేహితుడు ఉన్నట్లు గాసమాచారం. మృతుల వద్ద లభించిన ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాల ఆధారంగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన వారు కాగా ప్రస్తుతం హైదరాబాద్ లోని నివాసం ఉంటున్నారని తెలిసింది. చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు
రైలు ఢీ కొనడంలో నలుగురు మృతి
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని నలుగురు మృతి చెందారు. వారిలో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉన్నారు. చర్లపల్లి నుంచి షాలిమార్ వెళ్తున్న ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమవడంతో గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల వయసు 30 నుంచి 35 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఓ మహిళా మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డుపై షేక్ హసీనా అని ఉంది. మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో బైక్ పార్క్ చేసిన రసీదు గుర్తించారు. ఘటనా స్థలిలో రెండు ఫోన్లు లభించినప్పటికీ అవి ధ్వంసమయ్యాయి. వాటి సిమ్‌కార్డులు వేరే చరవాణిలో వేసి మృతులు ఎవరనేది ఆరా తీస్తున్నారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ ఎస్సై అప్పారావు తెలిపారు.