విధాత : ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో బేబి బాస్,యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశారు. తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు.సంజు శాంసన్ స్థానంలో వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
వైభవ్ టీమిండియా తరుపున…అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న అతి పిన్న వయసు భారత క్రికెటర్‌గా(15 ఏళ్ల 99 రోజుల వయసు) రికార్డు సాధించాడు. సచిన్ రికార్డు(16ఏళ్ల 205 రోజులు)ను వైభవ్ అధిగమించాడు. ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టీ20 ప్రారంభమైంది.
14పరుగులకు వైభవ్ అవుట్
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా వచ్చారు.వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న మూడో బంతికి సింగిల్ తీసి అంతర్జాతీయ క్రికెట్ లో తన పరుగుల ఖాతా తెరిచాడు. జోఫ్రా ఆర్చర్, టంగ్ బౌలర్లలో వైభవ్ సూర్యవంశీ ఒక్కోటి చొప్పున రెండు సిక్సర్లు కొట్టాడు. అభిషేక్ కూడా మరోవైపు ఫోర్లు, సిక్సర్ బాదడంతో టీమిండియా 5ఓవర్లకు 50పరుగులు చేసింది. విల్ జాక్స్ బౌలింగ్ లో వైభవ్ 10బంతుల్లో 2సిక్సు లతో 14 పరుగులకు అవుటయ్యాడు. తొలి వికెట్ కు వారిద్దరు 5 ఓవర్లలో 50పరుగులు చేశారు. అభిషేక్ 424బంతుల్లో 1సిక్స్, 8ఫోర్లతో 43 పరుగులకు అవుటవ్వగా, ఇషాన్ కిషన్ 40బంతుల్లో 6ఫోర్లుతో 49పరుగులు, శ్రేయస్ అయ్యర్ (37), తిలక్ వర్మ (24*) రాణించడంతో టీమిండియా 20ఓవర్లలో 190పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్‌లు తలో వికెట్ తీశారు. తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైన విషయం తెలిసిందే.
ఓడిన టీమిండియా
టీమిండియా విధించిన 191పరుగుల టార్గెట్‌ని ఇంగ్లాండ్ ఆరు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జాకబ్ బెతెల్ (76*; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. హ్యారీ బ్రూక్ (39; 15 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్స్‌లు), టామ్ బాంటన్ (39; 32 బంతుల్లో) రాణించారు. అర్ష్‌దీప్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బట్లర్ డకౌటయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. మూడో టీ20 జులై 7న నాటింగ్‌హామ్‌లో జరగనుంది.
The start of a special chapter ✨
A proud moment as Vaibhav Sooryavanshi receives his #TeamIndia cap from Vice-Captain Tilak Varma 🧢
Updates ▶️ https://t.co/WYfL8tAm58 #ENGvIND pic.twitter.com/zpLtixYDgM
— BCCI (@BCCI) July 4, 2026