టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాటర్ అంజిక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించారు. ఈవిషయాన్ని రహానే తన అభిమానులకు సోషల్ మీడియా సందేశం ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. జీవితంలో ప్రతి పనికీ ఆరంభం, ముగింపు ఉంటుందని..ఈ రోజు నేను ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని తెలిపారు. సమయం వచ్చినప్పుడు దాన్ని మనం గౌరవించి ముందుకు సాగాల్సిందే. దేశం కోసం ఆడటం నా అదృష్టం అని.
20ఏళ్ల పాటు ఆటలో నాకు సహకరించిన అందరికి ధన్యవాదాలు అని రహానే చెప్పుకొచ్చారు. ఆటకు వీడ్కోలు పలకాల్సి వస్తుందన్న బాధతో ఉబికి వస్తున్న కన్నీళ్లను, గుండె లోతుల నుంచి వస్తున్న భావోద్వేగాలను నియంత్రించుకుంటూ రహానే చెప్పిన మాటలు అందరిని కదిలించాయి. తాను ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా ఆడనని రహానే భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. భారత క్రికెటర్‌గా నా అధ్యాయం ముగిసినా, క్రికెట్‌తో నా అనుబంధం మాత్రం ముగియదు. తదుపరి తరం ఆటగాళ్లకు సహాయం చేయడం, ఈ ఆట నాకు నేర్పిన విలువలను వారికి పంచడం, క్రికెట్ నాకు ఇచ్చిన దానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వడం నా తదుపరి లక్ష్యంగా రహానే పేర్కొన్నాడు.
17ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో రహానే 85 టెస్టు మ్యాచ్‌ల్లో 12 శతకాలు, 26 అర్ధ శతకాలతో సహా 5077 రన్స్ సాధించాడు. 90 వన్డేల్లో మూడు శతకాలు, 24 అర్ధ శతకాలు చేశాడు. 20 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో తేడాతో ఓడించి భారత్‌కు ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(2020-21) అందించిన ఘనత కెప్టెన్ గా రహానే సొంతం. మూడు ఫార్మాట్లలో 8,414పైగా పరుగులు సాధించాడు. విదేశాల్లో అత్యంత నమ్మకమైన భారత బ్యాటర్లలో రహానే ఒకడిగా గుర్తింపు పొందాడు. రహానే 2015 వన్డే ప్రపంచ కప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వెస్టిండీస్‌తో 2023 జూలైలో ట్రినిడాడ్‌లో జరిగిన రెండో టెస్టు అతని చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
Ajinkya Rahane announced his retirement from International Cricket.pic.twitter.com/J8fzbcJON2
— Don Cricket 🏏 (@doncricket_) July 30, 2026