హైలైట్స్:
- కరెంట్ కోతతో అష్టకష్టాలు పడుతున్న అన్నదాత
-
అధికారుల చుట్టూ ఎన్ని ప్రదిక్షణలు చేసిన పట్టని వైనం
విధాత : రాష్ట్రంలో ఒక పక్క ఎలినితో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండుతుంటే.. మరోపక్క కరెంట్ కోతల కారణంగా వేలాది ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో సాగు నీరు అందక, బోర్లు నడవక చేతికొచ్చిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా, పెద్దవూర మండలం, పోతునూరు గ్రామంలో కరెంట్ కోతల కారణంగా తొంభై శాతానికి పైగా వరి పంట ఎండి పోయింది. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రకటించిన 24గంటల ఉచిత విద్యుత్ సరఫరాను ..ఆచరణలో రోజుకు కనీసం 6 గంటలు కూడా నిరంతరాయంగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతాంగం వాపోతుంది. గంట గంటకు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో వరి పంటలు ఎండి పోతున్నాయని రైతుల ఆరోపిస్తున్నారు. పొట్ట దశకు వచ్చిన పంట కరెంట్ కోతల కారణంగా కళ్ల ముందె వర్రి పొలాలు నీటి కొరతతో నెర్రెలు బారిపోతుండగా..పంట దిగుబడి పూర్తిగా తగ్గే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ కోసం విద్యుత్ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అప్రకటి కరెంటు కోతలను నిరసిస్తూ.. దాదాపు 300 మందికి పైగా రైతులు పెద్దవూర సబ్ – స్టేషన్ ముందు ధర్నా కూడా చేశారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, తమగోడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కరెంటు కోతలపై తక్షణం స్పందించాలని కోరుతున్నారు. పంటలు ఎండి పోకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా 6 గంటల పాటైనా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.