విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం,వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు నెలలో పుంజుకున్న పసిడి, వెండి ధరలు..నెల చివరి వారంలో పతనమయ్యాయి. అయితే సెప్టెంబర్ 1వ తేదీన బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేయగా, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ. 1,56,930 వద్ద కొనసాగుతుంది.22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ. 1,43,850కి చేరింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,55,000 వద్ద నిలిచింది.
హెచ్చుతగ్గులతోనే ముందుకు..
బంగారం, వెండి ధరలలో స్వల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయాందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంగారం, వెండిలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టినవారు ప్రతికూల పరిణామాలకు భయపడి ఉపసంహరించుకోనవసరం లేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వెలువడే యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, సెప్టెంబర్ ఫెడ్ బ్యాంక్ సమావేశం, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు బులియన్ మార్కెట్ తదుపరి దిశను నిర్దేశిస్తాయని సీనియర్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ధీర్ఘకాలంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నారు.