భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,890 తగ్గి రూ. 1,58,240 వద్ద కొనసాగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.2,650 తగ్గి రూ. 1,45,050కి చేరింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,60,000 వద్ధ కొనసాగుతుంది. తగ్గిన ధరలు బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటగా ఉన్నాయి.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Aug 29, 2026, 11:00 am IST
Read Time: 2 mins
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల క్రమంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చ తగ్గులకు లోనవుతున్నాయి. ఆగస్టు మాసం ఆరంభం నుంచి వరుస పెరుగుదలను నమోదు చేస్తున్న పసిడి ధరలు శనివారం భారీగా తగ్గుముఖం పట్టాయి.

24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,890 తగ్గి రూ. 1,58,240 వద్ద కొనసాగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.2,650 తగ్గి రూ. 1,45,050కి చేరింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,60,000 వద్ధ కొనసాగుతుంది. తగ్గిన ధరలు బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటగా ఉన్నాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, డాలర్ విలువ, ఫెడరల్ వడ్డీ రేట్ల మార్పు, పెట్టుబడిదారుల లాభార్జన వంటి పరిణామాల మధ్య బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే పసిడి, వెండి ధరలలో తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా ధరలు మళ్లీ పుంజుకోవడం ఖాయం అని అంచనా వేస్తున్నారు.