భారత క్రికెట్ నయా సంచలనం..వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ నెల 26నుంచి ఐర్లాండ్ తో జరిగే టీ 20 సిరీస్ కోసం టీమిండియాకు ఎంపికైన 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. జూన్ 26న బెల్ఫాస్ట్ వేదికగా జరగనున్న తొలి టీ20లో 15 ఏళ్ల వైభవ్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. వైభవ్ కోసం టీమిండియా జెర్సీ పంపిన వీడియోను బీసీసీఐ ఎక్స్ లో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది. భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్ సూర్యవంశీ తన తొలి టీమిండియా జెర్సీని అందుకున్నాడు.
తన రూమ్ కు చేరుకున్న టీమిండియా జెర్సీ అందుకున్న వైభవ్ …ఆ జెర్సీ ధరించి భావోద్వేగంతో మాట్లాడిన వీడియోను బీసీసీఐ పోస్టు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తన హోటల్ గదిలోకి టీమిండియా జెర్సీ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. ‘జీవితంలో ఎప్పుడూ ఊహించని విషయం ఒక్కసారిగా నిజమైతే ఎలా స్పందించాలో తెలియదు. నాకు కూడా అదే అనిపించింది. ఆ క్షణాన్ని ఆస్వాదించడం తప్ప మరేం చేయలేకపోయాను’ అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశాడు.
నేను బ్యాట్ తో మైదానంలోకి దిగిన తొలి రోజు కన్న కల టీమిండియా తరుపున ఆడటం నిజం కాబోతుందని వైభవ్ సంతోషం వ్యక్తం చేశాడు, జీవితంలో కీలక మైలురాయికి చేరుకున్నానని, టీమిండియా జెర్సీ చేతికి అందగానే ఎంతో ఆనందం పొందానని, ఆ ఫీలింగ్స్ ను మాటల్లో చెప్పలేనంటూ వైభవ్ భావోద్వేగం చెందాడు. ఇక జట్టులో ఆడడం కోసం ఆతృతగా ఉన్నా’ అని తెలిపాడు.
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్‌కు టీమిండియా నంబర్-3 జెర్సీ కేటాయించారు. గతంలో ఈ నంబర్ జెర్సీని భారత క్రికెట్ దిగ్గజాలు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ధరించారు. ఇప్పుడు అదే జెర్సీతో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుండటం విశేషం. అయితే వైభవ్‌కు టీమిండియా తుది జట్టులో చోటు ఇవ్వడం కోసం రెగ్యూలర్ ఓపెనర్లైన సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలలో ఎవరో ఒకరిని పక్కన పెట్టాలి. లేదంటే సంజూను ఫస్ట్ డౌన్‌లో ఆడించి వైభవ్ ను ఓపెనర్‌గా పంపాలి. ఇదే జరిగితే కిషాన్‌ను తుది జట్టు నుంచి తప్పించాల్సి ఉంటుంది. మరి టీమ్ మేనెజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026