మేడిగడ్డ ఎల్ ఆండ్ టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..కీలక ఫైళ్లు దగ్ధం

మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కార్యాలయంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం.

మేడిగడ్డ ఎల్ ఆండ్ టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..కీలక ఫైళ్లు దగ్ధం

విధాత: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్న నిర్మాణ సంస్థ ఎల్ ఆండ్ టీ((L&T)కార్యాలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కార్యాలయంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై పలు రకాల పరీక్షలు కొనసాగుతున్న క్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం పలు సందేహాలకు తావిస్తుంది.