Virosh | పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిక్ అపియరెన్స్.. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్–రష్మిక సందడి

Virosh | టాలీవుడ్ స్టార్ కపుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మంద‌న్నా వివాహం అనంతరం తొలిసారిగా కెమెరా ముందుకు వ‌చ్చారు. పెళ్లయిన మరుసటి రోజే ఈ నూతన వధూవరులు రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

  • By: sn |    movies |    Published on : Feb 27, 2026 3:46 PM IST
Virosh | పెళ్లి తర్వాత తొలిసారి పబ్లిక్ అపియరెన్స్.. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విజయ్–రష్మిక సందడి

Virosh | టాలీవుడ్ స్టార్ కపుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మంద‌న్నా వివాహం అనంతరం తొలిసారిగా కెమెరా ముందుకు వ‌చ్చారు. పెళ్లయిన మరుసటి రోజే ఈ నూతన వధూవరులు రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమై అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో రష్మిక కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోగా, విజయ్ స్టైలిష్ ఇండో-వెస్ట్రన్ దుస్తుల్లో రాజసంగా కనిపించారు. సింపుల్‌గా, కానీ ఎలిగెంట్‌గా కనిపించిన ఈ జంటను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

అభిమానులకు ఫ్లయింగ్ కిస్‌లు

అభిమానుల కేరింతల మధ్య విజయ్–రష్మిక చిరునవ్వులు చిందిస్తూ వారికి అభివాదం చేశారు. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ ఫ్యాన్స్‌కు హాయ్ చెబుతూ కనిపించారు. నూతన దంపతుల ఆనందం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఇక వారిని చూసిన అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. కొంద‌రు అయితే ర‌ష్మిక దేవ‌ర‌కొండ అంటూ క్యూట్‌గా అర‌వ‌డంతో ర‌ష్మిక ముఖంలో ఆనందం మాములుగా లేదు.

సోషల్ మీడియాలో వైరల్

ఇటీవలే ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం వెంటనే పబ్లిక్‌లో కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. కాగా, గీతా గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఈ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో రష్మిక, విజయ్ ఏడడుగులు వేశారు. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు “విరోష్” జంటకు కొత్త జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ జంట మార్చి 4న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్ వేడుక‌ని గ్రాండ్‌గా జ‌రుపుకోనున్న విష‌యం తెలిసిందే.