రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !

మహేశ్ బాబును శ్రీరాముడిగా, జూనియర్ ఎన్టీఆర్‌ను రావణుడిగా చూపిస్తూ రూపొందించిన ఏఐ ఫ్యాన్‌మేడ్ ‘రామాయణ’ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

Reported by: Tejaswini Nanna | వినోదం | Jul 15, 2026, 5:51 pm IST
Read Time: 4 mins
రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !

బాలీవుడ్ లో హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా రూ.4వేల కోట్ల బడ్జెట్ తో నితేష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ టైటిల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే తెలుగులో దర్శక దిగ్గజం రాజమౌళి దర్వకత్వంలో రూపొందుతున్న వారణాసి మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు రాముడిగా కొంత సేపు కనిపించబోతున్నారు. దీంతో ఇటీవల రామాయణ కథ..అందులోని పాత్రధారులపై విపరీతమైన అంచనాలు..విశ్లేషణలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘రామాయణ’ టైటిల్‌‌తో ఏఐలో రూపొందించిన ఓ ఫ్యాన్‌మేడ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిమానులు కృత్రిమంగా రూపొందించిన ‘రామాయణ’ ఏఐ ట్రైలర్ కాన్సెప్ట్ వీడియోలో శ్రీరాముడిగా మహేష్‌బాబు, సీతగా కీర్తి సురేశ్, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను చూపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్లు ఆయా పాత్రలకు వారైతేనే బాగా సరిపోతారంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌తో నిజంగానే రామాయణ సినిమా వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసలే పౌరణిక, జానపద కథలు, సోషియో ఫాంటసీ సినిమాలు తీయడంలో టాలీవుడ్ ఇండస్ట్రీ.. బ్లాక్ ఆండ్ వైట్ సినిమాల కాలం నుంచి కూడా దేశ చలన చిత్ర పరిశ్రమలో తన పైచేయి చాటుకుంది. ఇప్పుడు భారీ బడ్జెట్ తో బాలీవుడ్ రామాయణ మూవీ రాబోతున్న తరుణంలో టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లతో కృత్రిమంగా రూపొందిన ‘రామాయణ’ ఏఐ ట్రైలర్ కాన్సెప్ట్ వీడియో చూస్తే..మరోసారి అలాంటి సినిమాలకు ట్రేడ్ మార్క్ టాలీవుడ్ అనక తప్పదంటున్నారు అభిమానులు.