Mahesh Babau | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతోనే కాకుండా స్టైలిష్ లుక్స్, వ్యక్తిత్వంతో కూడా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేష్, వయసు పెరుగుతున్న కొద్దీ మరింత హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అందుకే అభిమానులు ఆయనను “ఎవర్‌గ్రీన్ హ్యాండ్సమ్ స్టార్” అని పిలుస్తుంటారు.

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ కూడా వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం.

ఐడీ కార్డ్ వైర‌ల్..

ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ బాబు కాలేజ్ రోజుల జ్ఞాపకాలకు సంబంధించిన ఓ ఐడెంటిటీ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైలోని ప్రముఖ లోయోలా కాలేజీలో మహేష్ బాబు బి.కామ్ చదివిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఐడీ కార్డు నిజంగానే ఆయనది కాదా అనే చర్చ మొదలైంది.

వైరల్ అవుతున్న కార్డులోని వివరాల ప్రకారం, మహేష్ బాబు పూర్తి పేరు ఘట్టమనేని మహేష్ బాబుగా పేర్కొన్నారు. అలాగే ఐడీ నెంబర్, రోల్ నెంబర్, 1997–2000 బ్యాచ్ వివరాలు కూడా అందులో ఉన్నాయి. అంతేకాకుండా జన్మతేదీ, బ్లడ్ గ్రూప్, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలు కూడా అందులో కనిపిస్తున్నాయి. కార్డుపై కాలేజ్ ప్రిన్సిపాల్ సంతకంతో పాటు మహేష్ బాబు సంతకం కూడా ఉండటంతో చాలామంది అభిమానులు దీనిని ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.

ఇది నిజ‌మా,ఫేకా..

అయితే ఈ ఐడీ కార్డుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు “అప్పట్లో కూడా మహేష్ ఎంతో స్టైలిష్‌గా ఉన్నాడు” అంటూ కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఫేక్ అని చెబుతున్నారు.

నిజానికి ఈ కార్డు విషయంలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణం ఏమిటంటే.. ఇదే డిజైన్, ఇదే ఫార్మాట్‌తో ఇతర సినీ హీరోలకు సంబంధించిన ఐడీ కార్డులు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు ఇవి ఎడిటింగ్ ద్వారా తయారుచేసిన ఫేక్ క్రియేషన్స్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు.

సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫోటోలు, కాలేజ్ జ్ఞాపకాలు, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సమాచారం నిజమా? కాదా? అన్న విషయాన్ని ధృవీకరించకుండా నమ్మడం సరైన పద్ధతి కాదని పలువురు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటే, మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, అభిమానులు మాత్రం ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Globe Trotter (@bob__jr____)