డియర్ బ్రదర్ వాస్తవాలు తెలుసుకో: కేటీఆర్ పై కవిత ఫైర్

ఢిల్లీ లిక్కర్ కేసు వ్యాఖ్యలపై కేటీఆర్‌ను కవిత తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమికి తాను కారణం కాదని, వాస్తవాలు ఒప్పుకోవాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.

డియర్ బ్రదర్ వాస్తవాలు తెలుసుకో: కేటీఆర్ పై కవిత ఫైర్

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసును కోర్టు కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తునే..ఈ కేసుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. తాను కేటీఆర్ అన్న ట్వీట్ చూశాను అని, ఒక పక్క కంగ్రాట్స్ చెబుతూనే.. మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసునే కారణం అన్నట్టు ట్వీట్ చేశారని, నాపై కేసు పెట్టింది ఎందుకోసం? బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయంం కోసం కాదా ? అని కవిత ప్రశ్నించారు. ఈ కేసు వల్ల బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేదని కేటీఆర్ ను కవిత నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను కారణమా అంటూ కేటీఆర్ పై ఆగ్రహం వెళ్లగక్కారు.

ఇండ్లు, ఉపాధి ఇవ్వలేదన్న అంశంతో పాటు దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడమే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం కాదా? అని కవిత ప్రశ్నించారు. డియర్ బ్రదర్ వాస్తవాలను ఒప్పుకో.. మిమ్మల్ని ప్రజలు వద్దన్నారని తెలుసుకో అంటూ చురకలేశారు. క్రేజీవాల్ అరెస్టు అయ్యాక ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయి అని.. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయాక నన్ను అరెస్టు చేశారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

తప్పు తేలకుండానే నా వ్యక్తిత్వ హననం చేశారు అని, కేసు పెట్టినప్పుడు, తప్పుడు ప్రచారం చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అని కవిత తప్పుబట్టారు. పార్టీ ఓటమిని నాపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరు అన్నారు. కేటీఆర్ ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు అని, తప్పుచేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశఆరు.

రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నానని, తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఒక్కటే అన్నారు. ఎన్నో అవమానాలు ఎన్నో ఎదురుదెబ్బలు, చెయ్యని తప్పుకు జైలు జీవితం అనుభవించానని, ప్రత్యర్థుల దగ్గర లిక్కర్ క్వీన్ అంటూ మాటలు పడ్డానని వాపోయారు. చివరికి ఈమె చేసిన తప్పు వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఒక నింద తో కుటుంబానికి, పార్టీకి దూరమయ్యానని, జైలులో ఉన్న రోజే దైర్యంగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని ఛాలెంజ్ చేశానని గుర్తు చేశారు. చెప్పినట్టే ఈరోజు కోర్టు కూడా లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చి నన్ను నిర్దోషి అని తేల్చింది అని, చివరిగా ఈ లిక్కర్ కేసులో మొత్తం పరువు పోగొట్టుకుంది మాత్రం బీజేపీ పార్టీ అని కవిత విమర్శించారు. తమకు అనుకూలంగా లేని రాజకీయ పార్టీల మీద కక్ష తీర్చుకోవడానికే సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు పని చేస్తున్నాయి అని మరోసారి నిరూపితమయ్యిందని అన్నారు.

ఇవి కూడా చదవండి :

Botsa Satyanarayana : బొత్సకు బ్రెయిన్‌ స్ట్రోక్‌..నిలకడగా ఆరోగ్యం
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్